సూదంటే కేసీఆర్ కు మహా భయమట..పర్సనల్ సీక్రెట్ చెప్పిన కేసీఆర్...!!

Shyam Rao

ఒక వ్యక్తి సమాజంలో ఎలాంటి పదవిలో కొనసాగుతున్నా, ఎంతటి హోదాలో ఉన్నా కొందరికి కొన్ని అంటే భయం అనేది ఉంటుంది. ఇది సహజం కొంత మందికి కొన్ని రకాల వస్తువులంటే, కొన్ని రకాల సంఘటనలంటే భయం ఉంటుంది. దేశాధ్యక్షులు సైతం ఇందులో భాగమే. అయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక విషయంలో భయపడతారట. అదేంటంటే.. ఆయనకు సూది అంటే మహా భయమట. ఆయన  కంటి ఆపరేషన్‌ను పదే పదే వాయిదా పడటానికి గల కారణం కూడా సూది భయమే నట. 



కేసీఆర్ కు కంటిలోశుక్లాలు వచ్చాయని, ఆపరేషన్ కోసం ఢిల్లీ వెళ్లారని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే రెండు సార్లు ఆపరేషన్ కోసం వెళ్లిన ఆయన రెండు సార్లు వాయిదా వేసుకుని హైదరాబాదు వచ్చారు. అయితే ఏదో కారణాలతో ఆయన తన కంటి ఆపరేషన్ ను తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే వాస్తవానికి ఆపరేషన్ తప్పించుకునేందుకు కారణం ఆ కారణాలు కాదని కేసీఆర్ స్వయంగా పార్టీ ఎంపీలతో చెప్పడం విశేషం. 



తనకు సూది మందంటేనే భయమని, వీలైనంత మేరకు మందు బిళ్లలతోనే రోగాలను నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పడంతో ఎంపీలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ‘‘తెలంగాణ తెచ్చిన వీరాధివీరులు మీరు. ఎన్నో రాజకీయ కుట్రలను ఎదుర్కొన్నారు. వేటికీ భయపడని మీరు.. ఒక్క సూది మందుకు భయపడతరా సారూ! చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో సూదిమందుకు భయపడటం లేదు.. మీరేంది సారూ?’’ అని ఎంపీలు ప్రశ్నించారట.  ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదని, ఈ విషయం ఎవరితోనూ చెప్పకండి, చెబితే ఈసారి బలవంతంగా ఆపరేషన్ చేయిస్తారని కూడా ఆయన అన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: