జాగ్రత్త! గూగుల్ మాప్స్ నమ్మ తగినవి కావు: సర్వే ఆఫ్ ఇండియా




గూగుల్ మాప్స్ ప్రామాణికమైన సమాచారం ఇవ్వటము లేదని, నగరాల్లోని పార్కులు, హోటళ్ళు మొదలైన వాటి లొకేషణ్లు సరిగ్గ చెప్పగలవని, దేశసరిహద్దుల విషయం ఎప్పుడూ వివాదాస్పదమే. అంటే గుగుల్ మాప్స్ బాధ్యతాయుతంగా ప్రవర్తించిన దాఖలాలు లేవని సర్వే ఆఫ్ ఇండియా అభిబాషణ.
       



మనం ఏదైనా అంశంపై అనుమానం ఉంటే లేదా తెలియకపోయినా గూగుల్ ను ఆశ్రయిస్తుంటాం. అంతేకాదు ఈ మధ్య కాలం లో లోకేషన్ కోసం గూగులే మనకు ప్రధాన సోర్స్ గా మారింది. తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాపే పెద్ద దిక్కు గా మారింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ సాయంతో మొబైల్ లో మీట నొక్కితే చాలు, మనం ఎక్కడున్నది, ఎటుపోతున్నది, ఎటు పోవాలన్నది, గమ్యస్థానానికి ఇంకా ఎంతచేరువలో ఉన్నామో గూగులే చెబుతుంది.




అలాంటి గూగుల్ చెప్పే మ్యాప్-విశ్లేషణ ప్రామాణికం కాదంటోంది సర్వే ఆఫ్ ఇండియా.  గూగుల్ మ్యాప్ లు ప్రామాణికమైనవి కావు. అవి కేవలం పార్కులు, రెస్టారెంట్ల లోకేషన్లు తెలుసుకోవడానికి మాత్రమే అధికంగా ఉపయోగపడుతున్నాయి అని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రభుత్వం గూగుల్ మాప్స్ పై ఆధారపడదని ఆయన తెలిపారు.


సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్-డెహ్రాడూన్ సంస్థ చెప్పే జియెగ్రాఫికల్ సర్వే, జియోగ్రాఫికల్ మ్యాప్ లు, ఎరోనాటికల్ చార్టులే ప్రామాణికమని ఆయన చెప్పారు. జమ్ము కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లు వివాదంలో ఉన్నాయని గూగుల్ గతంలో చెప్పిందని, ఇవి భారత్ లో అంతర్భాగమని అది చెప్పలేకపోయిందని ఆయన గుర్తు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: