తెలుగు మీడియా తెలుగుదేశం మనుగడ కోసం బ్రోకరేజ్ చేస్తుంది, ప్రజలను మరచింది




భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పొత్తు అవసరం తెలుగుదేశానికే.  అంతేకాదు ఆ పార్టీ నాయకులకు వారి బందుగణానికి వారి వారి పంచమాంగదళాలకు చాలా అవసరం. కేసినేని నాని లాంటి వాళ్ళు బీరాలు పలుకుతున్నా ఒక్క సారి "నమో-షా" లు కళ్ళెర్ర చేస్తే నానియేం ఖర్మ అధినాయకత్వానికే వణుకుపుడుతుంది. ఎందుకంటే వారీపై ఉన్న అభియోగాల చిట్టా. ముఖ్యం గా "బ్రీఫ్డ్-మి" తో విశ్వవిఖ్యాతమైన  "ప్రజాప్రతినిధి ఓటు కొనగోలు వ్యవహారం"  ఆ నాయకుని గౌరవ మర్యాదలను నేలబారు కీడ్చింది.    


 
జగన్ ఏ ముహూర్తాన నరేంద్రమోదిని కలిసారో కానీ, అప్పటినుంచి తెలుగు తమ్ముళ్ళ లో ఈ గుబులు మొదలైంది, భయం, వణకు,  వారి వారి తప్పుల కుప్పలు గుర్తుకు వచ్చి వారి గుండెదడ తారస్థాయికి చేరింది. బయటకుమాత్రం మాత్రం  "బిజెపి తో పొత్తు వల్ల మేము చాలా నష్టపోయాం, ఆ పార్టీ తో పొత్తు లేకపోయుంటే ఇంకా ఇరగదీసే వాళ్ళం" అని అనే తెలుగుదేశం ప్రత్యేక తరహా ప్రగల్బాలు పలుకుతున్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ అక్షరాభ్యాసం కూడా దేశానికి ముఖ్య మైన విషయము లా రాసే జారుడు స్థితికి దిగజారటం జనం సహించలేకపోతున్నారు.  డంబాలకు పోతూ  బీరాలు పలుకు తున్నారు ఆ పార్టీ లోని నాయకమ్మన్యులు. 


కానీ, జగన్ బిజెపితో కలిస్తే తమకి ఓట్ల పరంగా కాకపోయినా, ఇతరత్రా చాలా నష్టాలు ఉన్నాయని తెదేపా అధినేతకు తెలుసు అందుకే  "అమిత్ షా పర్యటనకి ముందే తమ జాగ్రత్త లో తాము పడిపోయారు.  బిజెపి మీద ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న కేశినేని నాని, బాబూ రాజేంద్ర ప్రసాద్ లకు క్లాస్ పీకారు,  అని పచ్చమీడియా బిజెపి  మేర మెప్పు కోసం సోపేసేసింది.   అదీ అతి జాగ్రత్తగా అమిత్ షా వచ్చే సమయంలోనే. ఆయనొచ్చి వెళ్ళిపోయాక కుక్కతోక వంకరే. బిజెపి ని తిట్టిపోసే వార్తలే ప్రముఖంగా రాస్తారు. ఇదంతా ఏపికి చెందిన ఒక ప్రముఖుడు ఇప్పటికే నమో-షా లకు వివరించినట్లు అభిజ్ఞవర్గాల కథనం.  


ఇక నిన్నటి నుంచి,  అమిత్ షా, చంద్రబాబు ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న విషయాన్ని పచ్చమీడియా ఒక అద్భుతవార్త లాగా ప్రసారం చేసింది. బాబు- షా ల సయోద్య బాజపా-తెదెపా ల కంటే ఈ ప్రముఖ మీడియాకే చాలా, అవసరమన్న రేంజ్ లో వార్తలు వండేస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ మీడియా ఒక తెదెపాకు రక్షణ కవచంలా పనిచేసే బ్రోకరేజ్ వ్యవస్థ లాగా తయారైపోయింది.   


అమిత్ షా చంద్రబాబుల భేటీకి అంతర్జాతీయంగా నమో-ట్రంప్ భేటీ కిచ్చినంత ప్రాధాన్యత నివ్వటం శోచనీయం. అంత బిల్డప్ అవసరమా? జనానికి అర్ధమై ఈ మీడియా దౌర్భాగ్యాన్ని సోషల్ మీడియా ఎండగడుతున్నా "నవ్విపోదూగాక నాకేటి సిగ్గు" అనేలా పిచ్చి మీడియాలా ప్రవర్తించటాన్ని అనెకమంది చీ...చీ.. అంటూ చీ కొడుతున్నారి. 
దీన్ని బట్టి ఒక విషయం స్పష్టం అవుతోంది. బిజెపితో బంధాన్ని తెంచుకోవడం చంద్రబాబుకి ఏమాత్రం ఇష్టం లేదు. అంధ్ర ప్రదేశ్ లో "కమలం-సైకిల్"  దిగకుండా పచ్చమీడియా ఈ రెండు పార్టీల మధ్య "అనుసంధానకర్త పచ్చిగా చెప్పాలంటే బ్రోకర్ గా" పనిచేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: