స్పీడ్ థ్రిల్స్...బట్ కిల్స్...వేగం ఒక మైకం లాంటిది తాగకుండానే కిక్ ఇస్తుంది




ఈ ఆర్టికిల్ నిషిత్ నారాయణ గురించి మాత్రమే కాదు. ప్రతి సంపన్నుల, సెలబ్రిటీల, రాజకీయ నాయకుల, వాణిజ్య వ్యాపార ప్రముఖుల, సంపన్నుల సంతానం గురించే. 


 
నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతి వేగంగా కార్ నడపడం వల్ల బలమైన పిల్లర్ కి గుద్దుకుని "కార్ వేగానికి  పిల్లర్ స్ట్రెంగ్త్కి"  ఢీ కొట్టడం   ఫలితంగా మరణం దుర్భరమైంది. వెగం వల్లే చనిపోయాడు నిషిత్ నారాయణ అని పోలీసులు సైతం ధృవీ కరించారు. ఇందులో ట్విస్ట్ లు, మలుపులు, మెరుపులు పోలీస్ పరిశోదనకి ఆదేశించాల్సినంత అనుమానాలు, అపోహలు కాని లేనే లేవు. "సిసి కెమెరా ఫుటేజ్" ప్రతి విషయం అంటే స్పీడోమీటర్ యాక్సిడెంట్ కాగానే లాక్ అయింది కూడా స్పష్టంగా రికార్డు అయ్యింది.



మన నగర రహదార్లు గంటకు 80 కి.మీ. వేగానికైతే ఫర్వాలేదు. ఇప్పుడు నగరం లో నడుస్తున్న మెట్రో రైల్వే నిర్మాణ పనుల వల్ల చాలా చోట్ల 20 కి.మీ. వేగమూ ప్రమాదమే. ఆగండి, చూడండి, నడపండి అనేది ప్రస్తుత రహదార్లపై వాహనాలు నడిపే వారు పాటించ వలసిన నియమావళి. ఇక్కడ వేగం ప్రశ్నే లేదు. అది కాదు అసలు విషయం  కానే కాదు.  క్షేమంగా గమ్యం చేరటం.  "స్లో అండ్ స్టది విన్స్ ది రేస్"  ఇదే  ప్రధానం. 


నగర పరిధి లో 150 కిలోమీటర్ల పైబడి వేగంతో అందులోనూ అత్యాధునికమైన మర్సెడెస్ బెంజ్ వాహనంలో వెళ్తుంటే - ఆ స్పీడ్ థ్రిల్ ఇస్తుంది. కాని అదుపు తప్పితే అదే స్పీడ్  కిల్ చేస్తుంది.  చంపేసే  ప్రమాదం జరిగే అవకాశం అత్యధికం.  అయితే అదే జరిగింది నిషిత్ విషయములో. అతి చిన్న వయసులోనే ఇద్దరు యువకులు ప్రాణ స్నేహితులు ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు.



ఇక్కడ  "హై-స్పీడ్ బుక్ చేసే పోలీస్ భగవంతుడు మన  హైదరాబాద్ పోలీసులు కాదు" ఏ  కేసీఅరో, కేటీఅరో, కవితో, హరీష్ రావో చెపితే శిక్ష వేయకుండా వదలటానికి.  ఆయనకు  "మినిస్టర్ నారాయన కొడుకైనా కూలీ కన్నయ్య"  కొడుకైనా ఒకటే. "తప్పు చేసి థ్రిల్ పొందావ్. దానికి కిల్ ఐపోయి శిక్ష అనుభవించు"  అని అపరాధిని శిక్షించాడు. 




కొన్ని పత్రికలు వ్యక్తిగత రాజకీయ ప్రాపకాలకు ఏమైనా రాయొచ్చు. కాని మరణించిన "నిషిత్ నారాయన గురించి ఇతర కోణాల్లో, అంటే కార్  స్పీడ్ తప్ప అన్నీ విషయాల్లో తండ్రిని మించిన  సౌమ్యుడని "  వివరించిన వారికి ఒక మనవి. ఆయన ఇప్పటికే హైదరాబాద్ లో నాలుగు సార్లు హై-స్పీడు కారణంగా అపరాధ రుసుములు రు. 4000/- పైగా కట్టాడు.  మంత్రి నారాయన కొడుకుగా ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వదిలేసి ఉండవచ్చు. ఆయన ఆ వేగం తో కారు నడపటం నేరమే......


ఆ నేరాన్ని బుక్ చేసింది పోలీస్ లు కాదు అందుకే  "నేరానికి సాక్ష్యం, నేరాన్ని విచారణ, నేరాన్ని నిర్దారించింది  భగవంతుడే చేశాడు కాబట్టి  "అత్యంత సౌమ్యుని కొడుకు మరింత సౌమ్యుడైన నిషిత్, పత్రికల్లో ముఖ చిత్రాలు వేసి అయ్యో పాపం!  అని ప్రజలు ఘోషించినా, పేపరంతా ఆయన, ఆయన తండ్రి, విజయ గాధలు రాసుకున్నా "స్పీడ్ థ్రిల్స్ అండ్ కిల్స్"-----  అనే పై వాడి చట్టం ముందు  విచారణ జరిపి,  వేయాల్సిన శిక్ష వేసేసింది భగవంతుని న్యాయస్థానం.  చేయాల్సింది  చేసేసింది. తెలుగు పత్రికల వ్యక్తిగత ప్రాపకం "పై" వాడికి పట్టదు.


రాష్ట్ర ప్రధాన విద్యాసంస్థల యజమాని మరణం దుఃఖం  అందరి హృదయాలను తడితో తట్టినా -- ఏవరూ ఏమీ చేయలేని సరిదిద్ద లేని తిరిగి బ్రతికించ లేని బాధాకరమైన విషయమే.




అలాంటి బాధాకరమైన విషయాలే ఆయా విద్యాసంస్థల్లో  1500 మందికి పైగా విద్యార్ధులు  ఆ రాక్షస విద్యాభోదనకు లోబడలేక ఆత్మహత్యలు చేసుకున్నారన్న జనాభి ప్రాయం నిజమైతే  "ఆ సంస్థల యజమానికి ఆ దైవం ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం" ఇచ్చాడనే అనుకోవాలి.  

అన్నీ ప్రాణాలు అందరి ప్రాణాలు విలువైనవే ... నా.రా..య..ణా! వైకుంఠ పురాదీశా!  ..... దట్స్ ఆల్.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: