పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దిగ్గజాలను ఎదిరించి ఎదగాలంటే?



పవన్ కళ్యాణ్ భాధ్యత నెరిగి ప్రవర్తించటం చాలా అవసరం. "కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు" తాను రెచ్చిపోతే ప్రయోజనం ఉండదు. ప్రజలకు అసహ్యం కలిగే పరిస్థితులు కల్పించనవసరం లేదు. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేసిన వాళ్ళందరూ ప్రజలని ప్రధానంగా కుల ప్రాతిపథికగా విడగొట్టి తాము తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారు. తరవాత కాలములో మతం ప్రధానంగా రాజకీయాలు నడిచాయి. ఆ చరిత్ర రాసుకోవటం ఇక్కడ ప్రధానం కాదు.


బాషా భెషజం తో అంతర్లీనంగా భారత్ ఉత్తర దక్షిణాలుగానే కాదు - దక్షిణాదిన కూడా తమిళనాడు, పుదుచ్చెరి  తమిళ ఆధిపత్యం కోసం, కేరళ మళయాళ ఆధిపత్యం కోసం, కర్ణాటక కన్నడ ఆదిపత్యం తో రెండు తెలుగు  రాష్ట్రా ల్లో బాషా పర విద్వేషాలు అంతగా లేకపోయినా యాస, సంస్కృతిపరభెదం అంతరాంతరాల్లో ఉంది. అంతేకాదు ఈ మద్యనే ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ విద్వేషముతో విడిపో యాయి. మరి ఉత్తర దక్షిణ దేశ భావనలతో ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలేమీ ఉండవు.


అసలు స్వతంత్రం సమయములో మత ప్రాతిపదికన విడిపోయిన మతాతీత బారత్ ఇస్లాం పాకిస్థాన్ విడిపోయి పొందిన ప్రయోజనాలేమున్నాయి. ఇంకా విభజన కాలములో బ్రిటీష్ అమెరిక రష్యాల రాజకీయాలకు బలైన భారత్ పాకిస్థాన్ లు ప్రతి ప్రణాళిక లో వెల కోట్ల రూపాయలు రక్షణావసరాలకు నీటిపాల్జెస్తూనే ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం. ప్రజలెవరూ విభజన కోరుకోలేదు. రాజకీయనాయకులు అలా కోరుకోని తమ అధికార దాహం తీర్చుకున్నారు.




ఇస్లాం కు ఒక దేశం కావాలని కోరిన మహమ్మద్ ఆలి జిన్నా లో తారస్థాయికి చేరిన హైందవం పై కక్ష, నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్-బాటన్ ఆడిన శకుని రాజకీయం, జవాహర్లాల్ నెహౄ అపరిపక్వ ఆలోచనలు అవగాహన లేమి, సర్దార్ పటెల్ లాగా పటిష్ఠ మైన నిర్ణయం తీసుకునే చొరవ లేని భారత నెహౄ  నాయకత్వం, కాశ్మీర్ మహరాజు హరిసింగ్ సమయానికి తగిన నిర్ణయం తీసుకోలేక, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న తీరు - భారత ఉపఖండ విభజనకు నాంది ప్రస్థావన చేశాయి.


పాక్ పై విజయాలు మన స్వంతమైనా మన అతి మంచితనం సొమ్ము చేసుకోవటములో పాకిస్థాన్ పన్నిన వ్యూహం పైకి మనపై ప్రేమ కురిపిస్తూ అంతర్లీనంగా పాక్ కు సపోర్ట్ చేసిన యు.కె, యు.ఎస్.ఏ, యు.ఎస్.ఎస్.ఆర్ - రాజకీయ దూరాలోచనలు (దురాలోచనలు కూడా కావచ్చు) భారత్ ను తరవాత కాలములో అతి ధైన్య స్థితికి తీసువెళ్ళిన రాజకీయాలే మరల పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడా? అన్నదే కంపరం పుట్టిస్తుంది.  




పవన్ మీలో దేశ భక్తి అనే ఫైర్ ఉండొచ్చు. కాని అగ్నిని సరిగా భద్రంగా వాడక పోతే మన ఇళ్ళే   దహించుకు పోతాయి. దక్షిణ భారత్ అంటూ నీవు గింజుకుంటే తమిళులు ఏనాటి నుండో వారి మనసుల్లో గుంభనంగా పెంచుకున్న తమిళ దేశం అనే భావన  తెరపైకి వస్తుంది. అలాగే ఇతరులు. 


నీకు ఆ ఆలోచన రాగానే కాస్త ఉద్యమం ముదరనిచ్చి - నమో తన వ్యూహాన్ని తేరపైకి తెస్తే అంటే దక్షిణ భారత్ నాలుగు కాదు ఆరు ముక్కలు చేసే ప్రాతిపధికను సిద్దం చేస్తాడు. అప్పుడు నీ ఆలో చనకు "పురిట్లోనే సంధి కొడుతుంది"  పవన్ కళ్యాణ్! పంధా మార్చుకోండి  -  లేకుంటే పతనమే!  దేశ ఉత్తర దక్షిణ విభజన ఏవిధంగా చూసినా మనకు కీడే!


నీ సినిమా డైలాగులు నీవి కాదు. స్వతహాగా నీ కంత ఆలోచనే ఉంటే రాజకీయ సమర్ధత ఉంటే నాడు తెదెపా-బిజెపి కూటమికి సహాయం చేయకుండా వారితో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివై ఉండేవాడివి. మోడీ కి చంద్రబాబు పై ఇసుమంతైనా గౌరవం లేదని విజ్ఞులు అంటున్నారు. ఆ పరిస్థితుల్లో రాజకీయ జ్ఞాన శూన్యుడివైన నిన్ను సరిగ్గా ముఖ్యమంత్రిగా వాడేసి ఉండేవాడు.




అఫ్కోర్స్,  కాలాంతరములో నీవు కూడా రాజకీయాలు ఒంటబట్టించుకునే వాడివేమో! ఏదో త్రివిక్రం రాసిన పంచ్ డైలాగ్స్ అయిపోగానే ఏంచేస్తావ్? మాట్లాడితే క్యూబా నాయకుడు “చెగువేరా”  ని ఉద హరిస్తారు మీరు. ఆయన దేశానికి సర్వం, జీవితం మొత్తాన్ని త్యాగం చేయటమేగాదు ఆరు నుండి ఏడు దశాబ్ధాలకు క్యూబన్లకు మార్గదర్శనం చేయగల నాయకత్వాన్ని మొక్కవోని పరాక్రమాన్ని ఇచ్చారు. ఆయనను ఒక కమ్యూనిస్ట్ నాయకునిగా మాత్రమే చూడొద్దు. ఒక్క కోటి జనాభా ఉన్న అతి చిన్న దేశాన్ని తలచుకుంటేనే పెద్దన్న అమెరికా ఉచ్చ పోసుకొని-తడి ఆర్చుకున్న ఒక్క క్షణం కూడా ఈనాటి వరకూ లెనేలేదు.  


రెండు రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలున్నయ్. ఒక్కో సమస్యపై జనాన్ని కూడగట్టు కోండి. జస్ట్ వన్ ఇయర్ లో సమస్యల పై పోరాడు నాడు తెలంగాణా విప్లవంలో కేసిఆర్ చుట్టూ చేరినట్లు జనం నీకు తోడుంటారు.




కేశినేని ట్రావెల్స్ నుండి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. పై పడనున్న భారాన్ని ఎదుర్కుంటే చాలు, దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాద నేరగాళ్ళకి శిక్ష పడేలా చేస్తే చాలు - ఇప్పుడు చంద్రబాబు పూర్తి బలహీనం గా ఉన్నాడు. పలు కేసుల్లో ముద్దాయి గా ఉన్న జగన్ ప్రస్తుతానికి ఎంత కష్టపడ్డా ప్రయోజనాలు సాధించలేడు (ఆయన కంటే బాషను కాస్త మెరుగు పెట్టుకుని  మృదువుగా మార్చుకుంటే తను ప్రస్తుతం చేసే హోం-వర్క్ తో రోజా మంచి నాయకురాలౌతుంది)



కాంగ్రెస్ ను ఆంధ్రులు నమ్మరు. అందుకే బాబు కుల రాజకీయాలు నల్లేరుపై బండి నడకలా మెత్తగా నడుస్తున్నాయి. ఈ వైభవం క్కూడా కొంతకాలం మాత్రమే. ఆయనా చట్టపరమైన కేసుల ఉచ్చులో ఇరుక్కునేది తథ్యం. అందుకే రాష్ట్రములో ఉన్న రాజకీయ శూన్యతను సరిగా ఉపయోగించుకుంటే మంచి నాయకుడవ్వచ్చు. జయప్రకాష్, చలసాని, రోజా వంటి వక్తలను సలహాదారులు చేసుకుంటే జనసేన విజయం సాధించటం ఏమాత్రం కష్టం కాదు. ఎక్కడా ఏవిధమైన విభజన రాజకీయ సూత్రం అనుకున్న ప్రయోజనమివ్వదు.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: