నడిరోడ్డుపై లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్...!!

Shyam Rao

మనదేశంలో అవినీతిని అంతం చేద్దామని మోడీ  పెద్ద నోట్ల రద్దుతో పాటు మరింత కఠిన చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం అదంతా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు సమాజానికి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక అవినీతి మసి అంటుకున్న రంగం పోలీస్ రంగం. చట్టాన్ని కాపాడాల్సిన వీరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. హైదరబాద్ లో  ఒక ట్రాఫిక్ పోలీస్ వాహనదారుని వద్ద బహిరంగంగా లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కై సస్పెండ్ అయ్యాడు. ఒక యువకుడు తన మొబైల్ ఫోనో లో ఈ తతంగాన్ని అంతా విడియో లో బంధించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. 



వాహనాల లైసెన్సులను చెక్ చేస్తున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎదురుగా ఇక పెద్దాయన స్కూటీ పై రావడంతో ఆ ట్రాఫిక్ పోలీస్ ఆయన్ని ఆపి బండి పేపర్లు, లైసెన్స్ చుపంచాలని అడగ్గా ఆయన అవేమీ నాదగ్గర లేవనగానే బండి పక్కకు తీసి సార్ ధక్కరికి వెళ్లమని చెప్పగా అందుకు సిద్ధంగా లేని ఆ పెద్దాయన జేబుల్లో ఉన్న డబ్బుల్లో కొంత డబ్బును ఆ పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కి ఇవ్వగానే రెవరైన చూస్తున్నారా..? లేదా..?



అని గమనించకుండా జేబులో పెట్టుకున్న సంఘటనను ఒక యువకుడు తమ మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చచేస్తే ఆ విడియో ను ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వీక్షించారు.  అయితే ఈ వీడియో ను ఆ యువకుడు పోలీస్ కమీషనరేట్ కు ట్యాగ్ చెయ్యడంతో ఈ వీడియో ను వీక్షించిన కమీషనర్ ఆ ట్రాఫిక్ పోలీస్ ని సస్పెండ్ చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: