పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ పరువు కాపాడితే..టీఆర్ఎస్ ఎంపీ పరువు తీసారు..!!

Shyam Rao

ప్రజా ప్రతినిధి అంటే అను నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసేవాడని అర్థం. కానీ నేటి సరికొత్త రాజకీయ నాయకులు ఆ పదానికే అర్థాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఒక నాయకుడు ప్రజా సమస్యలు తెల్సుకోవాలంటే ప్రజల్లో కలియ తిరగాలి. మరి ప్రజా సమస్యలని పరిష్కరించాలంటే మాత్రం సభలో గళం విప్పాలి, సమస్యల గురించి చర్చించాలి, పరిష్కారాన్ని రాబట్టాలి. కానీ ఇలా ఎంత మంది నాయకులు చేస్తున్నారు. ఇలాంటి నాయకులను దేశంలో వేళ్ళపై లేక్కపెట్టుకోవచ్చు. మొన్నటివరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే.



అయితే ఈ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒక్కరంటే ఒక్కరే పార్లమెంట్ కు వంద శాతం హాజరయ్యారు. ఆయనే తోట నరసింహం. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నుండి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 మంది ఎంపీలలో కేవలం ఒక్క ఎంపీ మన తెలుగువారి గౌరవాన్ని కాపాడడం జరిగింది. అతి ఎక్కువే కాదు, అతి తక్కువ హాజరు శాతం కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే నమోదు అయింది.



తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి కేవలం తొమ్మిది శాతం మాత్రమే పార్లమెంట్ కు హాజరైనారు. ప్రజా సమస్యలపై మీకు పట్టింపు లేకుంటే ఎన్నికల్లో పాల్గొనకండి, అంతేగాని ప్రజాప్రతినిధులుగా గెలిచి పార్లమెంట్ సాక్షిగా పరువు తీయోద్దని ప్రజలంతా కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: