తెలంగాణా ఐదు రూపాయలు ఆంధ్రప్రదేశ్ మూడు రూపాయల తో సమానం





రియో ఒలంపిక్స్ లో రజత పథక విజేత, తెలుగుతేజం పీవీ సింధు తనకు ఇరు రాష్ట్రాలు ఇచ్చిన అవకాశాలలలో ఆమె ఓటు ఆంధ్రప్రదేషశ్ కే వేసింది. రజతం తెచ్చిన ఊపులో రెండు తెలుగు తాష్ట్రాల ప్రభుత్వాలు ఆమెకి రెడ్-కార్పెట్ పరచి ఘన స్వాగతం పలకడం ఘన సత్కారం చేయటం తో, తరించి పోయాయి. ఒకరికొక్కరు పోటీపడీ మరీ నగదు బహుమానాలు, ఒక్కొక్కరు ఇరు రాజషానుల్లో 1000 చదరపు గజాల విలువైన వసతి స్థలాలను ఇతర నజరానాలు ప్రకటించేశారు. ఏపీ సీఏం చంద్రబాబు సింధును విజయవాడలో సత్కరించిన సమయంలో రూ. 3 కోట్ల నజరానాతో పాటు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు 1000 గజాల స్థలం ఇచ్చారు. దీంతో పాటు గ్రూప్-1స్థాయి ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు.




అంతకంటే ముందే, తెలంగాణ ప్రభుత్వం ద్వారా కెసిఆర్ సింధుకి రూ.5 కోట్ల నగదు నజరానాని ప్రకటించింది. హైదరాబాద్‌ లో 1000 చదరపు గజాల నివాస స్థలాన్ని ఇచ్చింది. తెలంగాణ కూడా సింధుకి గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాన్ని ఆఫర్ చేశాడు.



అయితే, సింధు తన ఉద్యోగ అవకాశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే వినియోగించుకోబోతుంది. ఆమె ఏపీ ప్రభుత్వం ఆపర్ చేసిన డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌-1) ఉద్యోగానికి అంగీకారం తెలిపింది. దీంతో, యూపీఎస్‌సీ నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ కోటా లో సింధు మరో ఎనిమిది, తొమ్మిదేళ్లలో కన్-ఫర్డ్‌ ఐఏఎస్‌ కానుంది.


కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి అత్యుత్సాహానికి సింధు బ్రేక్ వేసింది. ఐదుకోట్లిచ్చిన కెసిఆర్ కంటే మూడు కోట్లిచ్చిన సిబిఎన్ అంటే సింధుకు నచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: