వందకోట్ల బహుమానం - చంద్రబాబు చమత్కారం


చంద్రబాబు చాలా విచిత్రంగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాస్త్రవేత్తలెవరైనా "నోబెల్‌ బహుమానం" పొందితే వారికి "నూరుకోట్ల బహుమానం" ఇస్తామని చంద్ర బాబు నాయుడు ఓపెన్ ఆఫర్‌ ఇస్తున్నారు. అంటే భారత్ లో అంత సమర్ధులైన శాత్రవేత్తలు ఉద్భవించరనా? లేక "మనవాళ్ళు వెధవాయ్ లోయ్" అని కన్యాశుల్కం లో గిరీశం అన్నట్లు తన మనసులో నమ్ముతున్నారా! ఆయన దాదాపు నాలుగు దశాబ్ధాలు రాజకీయాల్లో ఉన్నారు. అలాగే 15 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పని చేశారు. ఏనాడైనా శాస్త్ర విజ్ఞాన పురోగతికి, శాస్త్ర పరిశోధనలకు తాను ఊతమిచ్చిన సంధర్భం ఒక్కటైనా చూపగలమా? ఎలాగు నోబెల్ బహుమాన పురస్కారం ఆంధ్రులకు దక్కదని మనసా, వాచా, కర్మణా నమ్ముతూనే అంతటి బహుమానాన్ని ప్రకటన ఇస్తున్నారా? సుమారు నోబెల్ బహుమతి గ్రహీతకు భారత విదేశ మారక ద్రవ్య విలువ ప్రకారం 7 నుంది 8 కోట్ల రూపాయలు లభిస్థాయి. దానికి 100 కోట్లు అంధ్ర ప్రదేశ్ బహుమతి ప్రకటన చేయటం హాస్యాస్పదం.



ఒక శాస్త్రవేత్త తయారవ్వటానికి ప్రాధమిక, ఉన్నత, కళాశాల, యూనివర్సిటి స్థాయిలో ఎంతో కృషి, పునాదులు బేసిక్ సైన్సెస్ పై పడాలి. మనదేశం లో వివిధ శాస్త్రాల్లో మాస్టర్స్ చేసేవాళ్ళే కరువైపోయారు. అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కెంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞాశాస్త్రాభివృద్ధిపై చేస్తున్న నిర్లక్ష్యం మాటల్లో చెప్పటం అసాధ్యం. ఎప్పుడైతే చైతన్య, నారాయణ అనబడే కళాశాలలు పుట్టాయో అనాడే ఈ రాష్ట్రములో "శాస్త్ర విజ్ఞానం" మరియు విధ్యార్ధుల్లో మేధాశక్తి ఆలోచనా శక్తి మరణించింది. ఆ రెండు కళాశాలల జన్మ జాతికి తీరని అన్యాయం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క విధ్యార్ధి మెడిసిన్, లేదా ఇంగినీరింగ్ చదివి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించటమే జీవిత ధ్యేయంగా మారింది.


కనీస సంఖ్యలోనైనా మాధ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రి, బయాలజి లాంటి శాస్త్ర విజ్ఞాన సమూపార్జనకు ముందుకురావట్లేదు. అసలు సోషల్ సైన్సెస్ అయిన మనసిక, సాంఘిక విజ్ఞానం చదివటానికి ఉబలాటపడే విధ్యార్ధే కనపడడీ రాష్ట్రంలో. చరిత్ర, భూగోళం, సామాజిక అంటే సోషియాలజీ చదవక పోవటమే దేశంలో మహిళళపై జరిగే వికృత లైంగిక, సామాజిక కారణమని అసలు ప్రభుత్వాలకు తెలుసా? మనదేశములోస్ సమర్ధులైన చాటర్డ్ అకౌంటెంట్స్ సరిపడా ఉన్నారా? బయోకెమిస్ట్స్ ఉన్నారా? ఇవన్నీ మంత్రి నారాయణకు తెలియదా? ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదా? కాకపోతే తన పదవీ కాలములో ఏ ఒక్కరికీ నోబెల్ పురస్కారం జరగదని తన పాలనపై తనకు ఘట్టి నమ్మకం.



ఇలాంటి వాటికి బాల్యంలోనే పునాదులు పడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంట్లో పిల్లాడో పిల్లో పుడితే ఒక ఇంజనీరో, ఒక డాక్టరో పుట్టినట్లు భావించే రోజులివి. ఇంజనీరు లేదా డాక్టర్ కాని అబ్బాయిలకు పెళ్ళి కావటం అసంభవం. అందుకే అమ్మాయిలపై లైంగిక దాడులకు ఇదొక కారణం. అబ్బాయిల్లో అమ్మాయిలపై ఈర్ష్య అసూయలు దినదిన ప్రవర్ధమానమౌతున్నాయి. దీనికి కారణం సోషల్ సైన్సెస్ ను నిర్లక్ష్యం చేయటమే. అందుకే అన్నీ తెలిసిన బాబు ఈ సవాల్ విసిరారు. నిజంగా ఆయనకు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి కావాలననే సదాశయమే ఉంటే ముందు నారాయణను మంత్రి మండలిలో నుంచి పీకి పారెయ్యాలి.


ఆతరవాత సైన్సెస్ లో పరిశీధన చేయాలను కున్న వాళ్ళకి కళాశాల, విశ్వవిధ్యాలయాల్లో ప్రోత్సాహాకాలు ఉద్యోగం కలిపించే సౌకర్యం ఇవ్వాలి. స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ ఉదారంగా - కుల మత ప్రశక్తి రహితంగా - ఇవ్వాలి. అప్పుడే శస్త్రవేత్త అనే ఒక అనర్ఘరత్నం పుడుతుంది. వెయ్యి మంది విధ్యార్ధులు కృషి చేస్తే ఒక్కడు మాత్రమే మంచి శాస్త్రవేత్త అవ్వగలడు. బాబు ఆ సహనముందా? వేరే కులం వాడు ఆ విజయం సాధిస్తే ఆయన భరించగలడా? అదే జరిగితే డాక్టర్ లక్ష్మి యేనాడో ఉరికంబం ఎక్కి ఉండేది. ఆ చిన్నెలు బాబులో ఏకోశానైనా ఉన్నాయా?


పి.వి. సింధు క్రీడల్లో అదీ ఒక రజతం సాధిస్తేనే ఆమెపై దేశం రాష్ట్రాలు ధన, కనక వర్షం కురిపించి విజయం తమ రాజకీయ ఖాతాలో, కుల ఖాతాలో వేసుకోవటానికి ప్రత్నిచిన దుర్మార్గం జనవాహినికి, గూగుల్ కు తెలుసు. ఆ సొమ్ము క్రీడా రంగానికే చిత్త శుద్ధితో ఖర్చు పెట్టి ఉంటే పదుల సంఖ్యలో సింధులు ఉద్భవించేవారు. అంత సొమ్ములు పొందిన సింధులో నిర్లక్ష్యం పెరిగి చిత్తశుద్ధి తగ్గి విజయాలు పలచబడ్డాయి. వ్యాపార ప్రకటనలు పెరిగాయి.  



క్రీడారంగంలో విజయాలు సాధించిన వారికి నగదు బహుమానాలు, భూవిరాళాలు ఇవ్వడం మన ప్రభుత్వాలకు, నాయకులకు ఒక అలవాటు. ఆయా క్రీడాకారులు తమకు సొంతంగా ఉన్న అవకాశాలను ఆసరా చేసుకునో, అసాధారణమైన స్థాయిలో శ్రమపడో- పతకాలో, విజయాలో తీసుకువస్తారు. మేటి క్రీడాకారులు రూపొందడానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ ప్రభుత్వాలు చేయవు. విజేతలను సత్కరించడమే తప్ప, విజేతలను తయారుచేసే వ్యవస్థలను నిర్మించడం ప్రభుత్వ విధానాలలో కనిపించదు.


మ్యాజిక్కులు  చమత్కార  విన్యాసాలూ చేసే రంగంగా ముద్రపడకుండా శాస్త్రం మానవీయం కావాలి. ఆ స్పృహ ఉన్నప్పుడు, “క్యాష్‌లెస్‌ కావడం కంటె క్యాస్ట్‌ లెస్‌”  కావడంలోనే దేశ పురోగతి ఉన్నదని మనకు తెలుస్తుంది. అణగారిపోయిన మేధలన్నీ వికసించి, విజ్ఞానసంపదతో దేశం సుభిక్షమవుతుంది.  మహీధర నళినీ మోహన్, జమ్మి కోనేటి రావు లాంటి బాల విజ్ఞాన రచయితలు తమ రచనలతో బాల, యువ విధ్యార్ధులను ఉర్రుతలూగించాలి. విశ్రాంత శాస్త్రవేత్తలు, వైద్యులు, మానసిక విశ్లేషకులు రంగములోకి దిగి వారికి సేవలు అందించే రాజకీయ పరిణితి కూడా మన రాజకీయనాయకుల్లో తీసుకువస్తే నోబెల్ పురస్కారాల కోసం స్విడన్ వైపు చూడక్కర్లేదు. భారత్ కూడా పుష్కలంగా " కలాం - బాబా అంటే పురస్కారాలు" వందల్లో ఇవ్వచ్చు.


తిరుపతిలో జరుగుతున్న సైన్స్‌ కాంగ్రెస్‌లో ఆయన ప్రకటన శాస్త్ర విజ్ఞానరంగంలో పరిశోధనకు ప్రోత్సాహం అందించడానికి ఆయన తీసుకోవాలనుకుంటున్న చొరవకు అది ఒక సూచన కావచ్చు. మరొకరకంగా తన తపనను వ్యక్తం చేయడానికి ఆయనకు మార్గం తెలియకపోవచ్చు. లేదా మార్గమే లేకపోవచ్చు. శాస్త్ర, సాంకేతిక రంగాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నవి కాబట్టి, రాష్ట్రస్థాయి నాయకులు చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. అందుకే తాను ఈ ప్రకటన ఆయాచితమనీ తెలిసి చేసి ఉండవచ్చు.


నోబెల్‌ పురస్కార గ్రహీతలను కాకపోయినా, ఉత్తమశ్రేణి శాస్త్రజ్ఞులను రూపొందించడానికి కావలసిన పునాదులు పడవలసింది మాత్రం ప్రాథమిక, మాధ్యమిక విద్యాస్థాయి లలోనే.  ఇప్పుడు శాస్త్ర పరిశోధకులను ప్రోత్సహించే ప్రకటనల విషయంలో కూడా అదే పోకడ కనిపిస్తోంది. క్రీడామైదానాలు కానీ, ఆటలాడుకునే సమయం కానీ లేకుండానే పాఠశాలలు నడుస్తున్నాయి. అవే పాఠశాలల్లో సైన్స్‌ విద్యపై అభిరుచిని పెంచే కనీస సదుపాయాలు కూడా ఉండడం లేదు. ప్రయోగశాలలకు కావలసిన సామగ్రి లేదు, అందుకు డబ్బు వ్యయం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలేవీ ఉత్సాహం చూపడం లేదు. అన్ని చదువులూ వృత్తిపరమైన, సాంకేతికమైన కోర్సులకే దారితీస్తున్నాయి తప్ప, ప్యూర్‌ సైన్సెస్‌ చదవడానికి సమాజంలో ఏవిధమైన ఒరవడి కనిపించటం లేదు?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: