'మా టీవీ' మౌనం ఎందుకో..?

Devi Priya
తెలుగు టెలివిజన్ పరిరక్షణ సమితి డబ్బింగ్ సీరియల్స్ కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోనళ ఉద్రిక్తతకు దారితీసింది. డబ్బింగ్ సీరియల్స్ ను నిలిపివేయాలంటూ 'మా టీవీ' ఆఫీసు ఎదుట మరోసారి సోమవారం టీవీ జేఏసీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో టీవీ ఆర్టిస్టులు, 'మా టీవీ' సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. డబ్బింగ్ సీరియల్స్ నిలిపి వేస్తామని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీవీ ఆర్టిస్టులు స్పష్టం చేశారు. 'మా టీవీ' యాజమన్యం స్పందించకపోతే ఉగాది నుంచి అమరణ నిరహారదీక్ష చేస్తున్నట్టు నటుడు నిర్మాత వినోద్ బాల ప్రకటించారు. 'మా టీవీ' మాత్రమే.. డబ్బింగ్ సీరియల్స్ పై ఆర్టిస్టులు చేస్తున్న పోరాటానికి ఫలితంగా ఇప్పటికే కొన్ని టీవీ చానల్స్ స్పందించాయి. తెలుగు టీవీ కళాకారులు పొట్టగొట్టే అలాంటి సీరియళ్ల ప్రసారాలను నిలిపి వేస్తారామని హామీ ఇచ్చారు. అయితే నాగార్జున, చిరంజీవి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న ‘మాటీవీ' మాత్రం డబ్బింగ్ సీరియళ్ల ప్రసారం నిలిపి వేసేందుకు ఒప్పుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. డబ్బింగ్ సీరియళ్లను ప్రొత్సహిస్తూ మా పొట్టగొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాటీవీలో డైరెక్టర్లుగా ఉన్న నాగార్జున, చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుంటే తప్ప మాటీవీలో డబ్బింగ్ సీరియళ్లు ఆగే పరిస్థితి లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్ట కొట్టోద్దు.. తెలుగు భాషపై మమకారం చూపే కేంద్రమంత్రి చిరంజీవి.. ఈ విషయంపై స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల టీవీ ఆర్టిస్టుల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న దాసరి నారాయణరావు కూడా చిరంజీవినే టార్గెట్ చేశారు. డబ్బింగ్ సీరియళ్లు నిలిపివేయడానికి అన్ని ఛానల్స్ ఒప్పుకున్నా.. చిరంజీవికి చెందిన 'మాటీవీ' మాత్రం వారి గోడు పట్టించుకోవడం లేదని, ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న చిరంజీవికి ఇది తగునా అనే విధంగా పరోక్షంగా చురకలంటించారు దాసరి. టీవీఆర్టిస్టులకు మద్దతుగా దాసరి నిలవడంతోనే చిరంజీవి, నాగార్జున స్పందించడం లేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. దాసరి.. చిరు ఫ్యామిలీతో, అక్కినేని ఫ్యామిలీతో సఖ్యత లేదన్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి వర్గపోరు ఆర్టిస్టులపై పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఇతర రాష్ర్టల్లో మాదిరిగా ఇక్కడ కూడా స్ర్టయిట్ తెలుగు సీరియల్స్ కే అవకాశం ఇవ్వాలి. అప్పుడే మన ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: