సర్జికల్ స్ట్రైక్స్ వ్యూహం వెనుక అపర చాణక్య చంద్రగుప్తులు


యూరీ సెక్టర్ లోని భారత సైనికుల శిబిరం పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి జరిగి 19 మంది భారత జవాన్లను హతమార్చిన తరవాత భారతీయుల హృదయాలన్నీ అగ్నిగుండాలుగా మారిపోయాయి. జె.సి దివాకర రెడ్డి లాంటి ప్రముఖ రాజకీయ వేత్త లైతే 125 కోట్ల భారత జనాబ్జాలో 10 కోట్ల జనాభా మరణించైనా పాకిస్థాన్ ను ప్రపంచపటం పై తొలగించాలనేంతగా ప్రతీకార జ్వాలల తో రగిలిపోయారు.


పాకిస్థాన్ ఉగ్రవాదులతో పాటు వారి సైనికాధికారుల, రాజకీయనాయకుల, ఐ ఎస్ ఐ లాంటి నిఘా వ్యవస్థల అధిపతుల పీచమణచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికుల నుండి అతి సాధారణ పౌరునివరకూ, మత, కుల, ప్రాంత, లింగ, పాఋతీ విభేదాల రహితంగా ఐఖ్యత తో గర్జించారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. 
"జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని" మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.



అయితే, అప్పటికే తెరవెనక చాణక్యం జరగాల్సినంతగా జరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు "అజిత్ దోవల్" నేపధ్యంలో ఉండి ఎక్కడా తెరమీద కనిపించక తెర వెనక ఉండి ప్రణాళికా రచనతో వ్యూహత్మక పోరాట పంధా రచనలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యూహాత్మక  తిరుగుబాట్లు నిర్వ హించటములో అపర చాణక్యుడైన అజిథ్ దోవల్ విశ్వాన్ని మెప్పించగల యుద్ధ రచన సిద్ధం చేశారు, అపర చంద్ర గుప్తుడైన మనోహర్ పారికర్ సాక్షిగా.



సర్వంసిద్ధం అన్నంతగా ఒక వారం రోజుల్లోనే మోడీ దౌత్యవ్యూహాన్ని ఒక సారి సమీక్షించుకున్నట్లు అర్థమౌతుంది.
రాజకీయవెత్తగా అకళింకితుడు, అతిసామ్యుడుగా సామాన్యుడుగా కనిపించే అనన్య సామాన్యుడైన మనోహర్ పారికర్ గురించి మనకు తెలుసు కాని తెలియాల్సింది అజిత్ దోవల్ గురించి అతని చాణక్య వ్యూల గురించి వాటి తుది ఫలితాల గురించి. మనోహర్ పారికర్ - అజిథ్ దోవల్ వీళ్లిద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనసెరిగి ప్రవర్తించే రాజకీయ అధికార రంగాల్లో ఆయన నమ్మినబంట్లు.  




పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలు చేయడానికి మన్మోహన్ సింగ్‌ను ఎలా ఎంచుకుని తీసుకొచ్చారో, అలాగే నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అప్పటి వరకు గోవా ముఖ్య మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కూడా రక్షణ మంత్రిగా తీసుకొచ్చారు.



మరోవైపు అప్పటి వరకు యూపీఏ హయాంలో పెద్దగా ప్రాధాన్యం లభించని అజిత్ దోవల్‌ను కూడా జాతీయ భద్రతా సలహాదారుగా (ఎన్.ఎస్.ఏ) నియమించారు. 2014 మే 26న మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 30వ తేదీన దోవల్ ఎన్‌ఎస్‌ఏ పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవ హారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన హస్తం ఉండని సందర్భం లేదు.


అజిత్ దోవల్: 1968 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. కేరళ కేడర్‌లో చేరిన ఈయన, 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎం.ఎన్.ఎఫ్) దేశంలోని ఈశాన్య రాష్ట్రామైన మిజోరం లో అల్ల కల్లోలం సృష్టించింది. అదే అదనుగా అజిత్ ఆ సంస్థలోకి చొరబడి, తనదైన రహస్య వ్యూహం తో దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. అప్పటినుండే ఎంఎన్ఎఫ్ నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు దాని ఆనుపానులే కరవయ్యాయి. 


ఇక పాకిస్థాన్‌ లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక "భిక్షగాడి"  వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్‌ లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టిమరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసు కున్న ఘనత అజిత్ దోవల్‌కు ఉంది.  అలాంటి  విధేయత, తదాత్మ్యత, ధీరత్వం, విజ్ఞత, అఖుంఠిత దీక్ష, అత్యంత దేశభక్తులకే సాధ్యం. 


ఇక భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సమయంలో అజిత్ దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లు అన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. "కుక్కేపారే" లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇటీవలే ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది కాలానికే ఇరాక్ నుంచి 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. పై అనుభవాలే  ఆయన 28/29.09.2016 న జరిగిన సర్జికల్ స్త్రైక్స్ కు ప్రేరణే కాదు కీలకం కూడా. 




శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స ఓటమి వెనక ఉన్నది కూడా అజిత్ దోవలే! రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన అజిథ్ దోవల్ అక్కడకు వెళ్లి చేసిన కౌటిల్యమే, మైత్రిపాల సిరిసేన విజయానికి కారణమైంది. మైత్రి పాలుడు తదుపరి అధ్యక్షుడయ్యారు.


ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేన ను చాణక్యుడు సాధారణంగా రచించే మిత్రభేదం వ్యూహంగా - ఆయన పై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా అజిత్ దోవలే. అంతేకాదు. మాజీ ప్రధానమంత్రి "రణిల్ విక్రమ సింఘే" ను పోటీ చేయొద్దని కోరి ఒప్పించారు కూడా. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసి మైత్రిపాల సిరిసేన ను అధ్యక్ష స్థానం లోకి వచ్చేలా చేశి భారత దేశానికి శ్రీలంక నుండి చైనా ద్వారా రానున్న పెను ప్రమాదాన్ని కొంతవరకు నివారించారనే చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: