ముగిసిన అఖిలపక్ష సమావేశం..సర్జికల్ స్ట్రైక్ పై చర్చ..!

Edari Rama Krishna
భారత లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు పాక్ వైఖరిస్తున్న కుటిల రాజకీయాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందని అంటున్నారు. పాక్ వైఖరి, తాజాగా పరిణామాలపై  నార్త్ బ్లాక్ లో ఆల్ పార్టీ నేతలతో చర్చించిన కేంద్రం భారత సైన్యానికి అభినందనలు తెలిపాయి. అకిల పక్షం తాజా పరిణామాలపై అన్ని పార్టీల సభ్యులకు వివరించించింది.   పాక్ పన్నిన కుట్రలకు జవాబే ఈ మెరుపు దాడులు అన్నారు వెంకయ్య నాయుడు. కేంద్రం తీసుకున్న మిలటరీ చర్యలకు అభినందనలు తెలిపిన అఖిల పక్షం.

ఈ సమావేశానికి అమిత్ షా, సీతారాం ఏచూరి,పాశ్వాన్,సీఎం రమేష్ శరద్ యాదవ్ , పారికర్, రాజ్ నాథ్, వెంకయ్య తదితరులు హాజరయ్యారు. 
 ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మిలటరీ సిద్దంగా ఉందన్న డీజీఎంవో.  సరిహద్దుల్లో 10 కి.మీ మేర ప్రజలను ఖాళీ చేయించాలని సూచన. పంజాబ్ సరిహద్దులో 10 కీ.మీ. మేర పాఠశాలలు మూసివేత.  జమ్మూ- కాశ్మీర్, గుజరాత్,రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్.

ఇప్పటికే జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై తమ సైన్యం దాడి చేసిన విషయాన్ని భారత్ అకస్మాత్తుగా గురువారంనాడు ప్రకటించింది. ఈ దాడుల్లో దాదాపు 38 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. యురిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 18 మంది భారత సైనికులను హతమార్చిన ఘటన జరిగిన 11 రోజులకు భారత్ తన యుద్ధనీతిని ప్రదర్శించింది. యురి ఘటనను క్షమించబోమని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా కూడా ప్రకటించారు.

 సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో తెలుసా?
నిర్ణీత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి భారీ నష్టం వాటిల్లేలా సైనిక దాడులకు పాల్పడటమే సర్జికల్ స్ట్రైక్. ఓ ప్రత్యేక ప్రాంతంపై, కచ్చితమైన విధంగా మిలటరీ దాడి చేయడమే. లక్ష్యిత వర్గాలకు మాత్రమే నష్టం కలిగించేలా, దాడుల వల్ల సమీప ప్రాంతంలోని సామాన్య ప్రజలు, భవనాలు, నివాస సముదాయాలకు వీలైనంత తక్కువ ప్రమాదం సంభవించేలా సర్జికల్ స్ట్రైక్ ఉంటాయి. ఆ మద్య మయన్మార్ భూభాగంలో భారత ఆర్మీకి చెందిన 70 మంది కమాండోలు ఆపరేషన్ నిర్వహించి కేవలం 40 నిమిషాల్లోనే 38 మంది నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. సర్జికల్ స్ట్రైక్‌కు దీన్ని చక్కటి ఉదాహరణగా పేర్కొనవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: