ఎవరేమనుకున్నా మా మాకేంటి సిగ్గు?

ఎవరేమనుకున్నా నాకేటి సిగ్గు? ఈ భావం బాగా పెరిగిపోయింది రాజకీయనాయకుల్లో. వైఎస్సార్ అంత సంపాదించినా తనవెంట ఎమీ తీసుకెళ్ళ లేక పోయారు. ఆ దురదృష్ట మరణములో ఆయన అన్నీ దేహభాగాలకు అంత్యక్రియలు జరిగాయా?  వేరే వారి దేహభాగాలు మిక్స్ అయ్యివుండవచ్చనీ, ఈయన దేహాంగాలు వెరే వారి వాటిల్లో మిక్స్ అయి ఉండొచ్చు అన్నదే అనుమానాస్పడం. నీదన్నది శరీరభాగాలతో సహా నీవి కాకపోవచ్చు. “నీ వెంట ఏదీ రాదు”  అని మరవని నాడే మనలో పేరుకుపోయిన స్వార్ధం విడనాడ గలం. ఇలాంటి పరిస్థితుల్లో బాబు గాని, కేసిఆర్ గాని భగవదానుగ్రహంగా దొరికిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని అద్భుత పాలన అదీ “పారదర్శకం” గా పాలించవచ్చుకదా?

 

ఇప్పుడు ధన, అధికార, కీర్తి దాహం లేకుండా చంద్రబాబు, కేసిఆర్ పరిపాలిస్తున్నారంటే పసిబాలుడు కూడా నమ్మలేని పరిస్థితి. నేను “నిప్పు” అని బాబు అన్నా! కెసీఆర్ తన పాలనలో అవినీతి లేదన్నా నమ్మిన వాడు ‘మానసిక వికలాంగుడే’  అని అంటున్నారు ప్రజలు.  భయంకరమైన నయీం లాంటి కాలసర్పాలను సృష్టించారు ఈ పార్టీల వాళ్ళు. టిడిపి, టిఆరెస్, వైఎసార్సిపి లు కూడా పవిత్ర పుష్పాలు కాదు. నాటి నేరస్తుడు టిఆరెస్ లో నేడున్నా నాడు టిడిపి కో కాంగ్రెస్ కో చెందిన వాడు అయ్యుండొచ్చు. అందరూ ఆ గొంగళి లోని వెంట్రుకలే. ఇక్కడ తరతమ భేదాలుండవు.  అన్నీ పాప పంకిల కాంగ్రెస్ పంకం (బురద) నుండి పుట్టిన అపవిత్ర పుష్పాలే. ఇందులో ఎవరూ పత్తిత్తులు కాదు.

 

ఇప్పుడు నయీం ను ఎంకౌంటర్ చేయటం గొప్ప విజయమేమీ కాదని - నరకాసురుడు రెచ్చిపోయి సాధుపుంగవుల్ని హింసించుతూ, చంపుతూ పోతే ఆ భగవానుని సన్నిధికి దగ్గరైన వారి జోలికి పోవటం వల్ల   సహించని దైవం నరకాసుర వధ చేసినట్లు - అధికార కేంద్రానికి అతి దగ్గరైన వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని "టచ్" చేయటమే ఆధునిక నరకాసురుడు నయీం ఎంకౌంటరుకు దారి తీసిందని ప్రజలు, టిఆరెస్ తో కలిపి అన్నీ రాజకీయ వర్గాలు బహిరంగంగానే చెపుతున్నారు. 

 

కెసిఆర్ తనని మహారాష్ట్ర ఒప్పందం విషయములో ప్రశ్నించిన ఉత్తం కుమార్ రెడ్డిని, జానారెడ్డి ని ప్రతిపక్షాల వారిని జైల్లో పెట్టె స్థాయివరకు తీసుకెళ్ళారు. తనను ప్రశ్నించటమే నేరమా? ఆరోపణలు వేలు చేస్తారు. మీ తప్పులేనప్పుడు మీకేమవదు గదా అంటున్నారు తెలంగాణా జనం. అంతే కాదు సహనం లేని సిఎం తెలంగాణాకు తగునా? నిజా నిజాలు ఎలాగూ విశ్లెషకులు ఎలాగు చెప్పుతారు  కొద్దిరోజుల్లోనే.

  

                       

హైదరాబాద్ ను విశ్వనగరం చెస్తానన్న తెలంగాణా సిఎం నగరం రహదారులు నరక ప్రాయం అవుతున్నా చుస్తూ ఉరకున్నారు. హైదరాబాద్ నవాబ్ లాగా ప్రజా ధనం నీళ్ళలా ఖర్చు పెడుతూ బండి లాగించే ఈ దొర తనం 80 వేల కోట్ల కొత్త అప్పు తెలంగాణా ప్రజల నెత్తిన తెచ్చి పెట్టిందని - తమ ఉద్యమ నాయకుడై ఉండీ తమ కష్టాలు పట్టించుకోవటం లేదంటున్నారు ప్రజలు.  క్రీడాకారులను కోటీశ్వరులను చెయ్యటం కాదు క్రీడాకారులను తయారుచెయ్యాలి, స్టేడీములు నిర్మించాలి, కోచ్ లను ఏర్పాటు చేసి యువతలో క్రీడోత్సాహం పెంచాలి, ప్రోత్సహించాలి. క్రీడా సంస్థల నాయకులు కొందరు జైళు శిక్షలు అనుభవించి వచ్చిన వారూ ఉన్నారు. ఎవరెంత నిజాయతీ పరులో ఇంకా చెప్పాలా? సానియా మీర్జా కావచ్చు, పి.వి. సింధు కావచ్చు ఏవరైనా ఇన్ని ప్రయోజనాలు పొందినా, అసలు జాతికి కావలసిన క్రీడా స్పూర్తిని పెంచి అనేక మంది కొత్త క్రీడాకారులను తయారు చేయగలిగేది గోపీచంద్ లాంటి నిస్వార్ధ కోచ్ లే అనేసంగతి మరచి పోయి నిరాదరణకు గురిచేసిన మంత్రులూ మన కాబినెట్ లో ఉన్నారు.  ఇక విశ్వనగరం అనేది కల్లోమాటని ప్రజలు నీళ్ళోదులు కొని  2019  లో ఒక చూపు చూద్ధామనుకొంటున్నారు.

 


ఏదేశములోనైనా మహనగరాలు ఎవరూ అధికారికంగా నిర్మించరు. హైదరాబాద్ నగరాన్ని – “మహమ్మద్ నగర్” పేరుతో నిర్మించిన "సుల్తాన్ ఖులీ ఖుతుబ్ షా" రోజుల్లో ముప్పై వేల జనాభా ఉనికి తో  ఆప్రాంతం ఉండేది.

అంతే కాదు నగరాన్ని ఐదు లక్షల జనావాసాన్ని భరించగల సామర్ధ్యమున్న సదుపాయాలు, రహదారులు, తాగు నీటి నరపరా, వినియోగించిన మురుగునీరు నగరపు సరిహద్దులు దాటించే మురుగునీటి పారుదల వ్యవస్థ లాంటి వన్నీ అద్భుతంగా కలిపించారు. భగవాన్, ఈ నగరాన్ని జనావాసాలతో నింపమని అల్లా ని ప్రార్ధించారు ఆ తరవాత.

 

అంతేకాని మహాభవనాలను వ్యాపార వాణిజ్యాల ను నిర్వహించటానికి ఎవరూ నిర్మించరు. రాష్ట్రవిభజన కు దోహదం చేసే లేఖ ఇచ్చిన బాబుగారు తన మనసును నాలుగు లక్షల నుండి ఆరు లక్షల కోట్లతో బాబుగారు విశ్వనగరం నిర్మిస్థాననే మాట కొన్ని లక్షల సార్లు పునరుద్ఘాటించారు. ఒక ప్రభుత్వం మహానగరాలను నిర్మించదు. అలా నిర్మాణాలను ప్రోత్సహించే వసతులను కలిపిస్తుంది. మహానగరాలను నిర్మించటం వ్యాపారులు చేసే పని. తమ వ్యాపార వ్యాప్తికి తామేమైనా చేసుకోవచ్చు.


ప్రజాస్వామ్యం లో ప్రజా-ప్రాంత విభజన తగదు


ఇది ప్రజాస్వామ్యం. తనిష్టమొచ్చినట్లు, ఇష్టమొచ్చిన ప్రాంతం, ఇష్టమున్న ప్రజలకోసం చేసే పనికాదు రాజధాని కోసం విశ్వనగర నిర్మాణం. భారత ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగాని గాని అలా ప్రవర్తిస్తే ప్రజలకు సమాదానం చెప్పించే వ్యవస్థలు ఉన్నాయి. కాకపోతే కాస్త ముందూ వెనక నడుస్తుంది వ్యవహారం. అమరావతి విషయం అత్యంత జుగుప్సాకరం. ఎం.ఓ.యూ కు ముందే సింగపూరు కి కాంట్రాక్టుకిచ్చే ప్రైవేటు ఒప్పండ రచన ప్రైవేటు సంస్థలతో జరిగిందని ఇందులో చంద్రబాబుకు వ్యక్తిగత లాభాలు స్వార్ధాలు ఇమిడి ఉన్నాయనేది ప్రజలు, ప్రతిపక్షాలు గొంతెత్తి చెపుతున్నా వారిని లక్ష్య పెట్టక, ప్రతిపక్షాల నిర్మూలన చేస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేఖ వ్యాసాంగాలు, మంత్రాంగాలు చేసేవారిని ఏమనాలి?

 

"ఓటుకు నోటు కేసు" లో విశదమైన బాబు నిప్పు నిజాయతీ బాహాటంగా బయటపడటం తెలుగు జాతికే కాదు భారత జాతికే కాదు ప్రపంచం అంతా అమరావతి అనగానే అందులో ఎన్నో స్కాములున్నాయని అనుకొంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ఉన్న నగరాలన్నీ వాణిజ్య నగరాలే. దేశ, రాష్ట్ర రాజధానులు పరిపాలన కోసం దాని అవసరాల కోసం నిర్మిస్తారు, అందుకే అవసరాలకు తగినంతగా ఉంటాయి. అమెరికా రాజధాని వాషింగ్-టన్ కూడా చాలా చిన్న నగరం.

 

బాబు విశ్వనగరం సంపూర్ణంగా వాణిజ్య నగరం. ప్రజల భూములను సేకరించటం లోనే మంత్రులంతా కుమ్మక్కై భూములను కొనేసారు. కొన్ని వారి పేరుతో కొన్ని వారి బినామీలపేరుతో. ఆ నగరం పుట్టకముందే సక్రమం గా కాకుండా అక్రమంగానే అన్నీ జరిగిపోయాయి.  భూసేకరణకు ముందే సేకరణకు గురికాని “సిటి న్యూక్లియస్ కు వాణిజ్యానికి” అతిదగ్గర ప్రాంతాన్ని స్వంతం చెసుకున్నారు.  ప్రతిపక్షాలకు ఆ అవకాశం లేకపోవటం తో ఈ గొంతెత్తి గోల చెయ్యటం జరుతుంది.

 

రాష్ట్ర ప్రజలు రాజధానిగా కోరని ప్రాంతమది. వేల్లది లక్షలాది ఎకరాల ముంగారు పంటలు పండే భూములు ప్రభుత్వ స్వాదీనమై కాంక్రీటు అరణ్యాలు గా మారి పోతున్నాయి. ఏ సంక్షేమ ప్రభుత్వమూ ఇలాచేయదు. అటు ఉత్తరాంద్ర, ఇటు రాయలసీమ వాసులు హర్షించని ప్రదేశమది. 13 జిల్లాలలో 8 జిల్లాల వాసులు వ్యతిరేఖత  ప్రదర్శిస్తున్నారు. తరచిచూస్తే అటు ప్రకశం, నెల్లూరు, ఉభయ గోదావరి జనులకు అర్ధాంగీకారమే కాని - అంగీకారం మాత్రం కాదు.



 


మరెవరి కోసం ఈ రాజధాని? బాబుకు, బాబు జనులకా?  రాష్ట్రం, రాజధాని - ఒక కుల, ప్రాంత ప్రయోజనాల కోసం కాదే?  అంతే కాదు రాష్ట్రంలో ప్రతిపక్ష నిర్మూలన చేస్తూ,  ఆపై ప్రశ్నించే వారే లేకుండా చేయటం,  ఒక వేళ ఎవరైనా ముందుకువస్తే సామ, దాన, భేద, దండోపాయాల తో నోరు మూయించటం - వారికి సరైన సమాదానా లిచ్చే వ్యవస్థ నిర్మించ కుండా - మూకుమ్మడి దాడి చేసే సంస్కార హీనమైన మంత్రులు వ్యవహారశైలి ఎవరూ హర్షించక పోవటం, రాను రాను దుబారా వ్యయాలతో చూస్తూంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమౌతుందని జనం కలవర పడుతున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం నిధులివ్వటంలో చేసే జాప్యమో? ఈ ప్రభుత్వం లోని లోసుగులు తెలిసి, వీరికివ్వక పోయినా ఏమీ కాదనే ధైర్యమో? అవినీతితో కంపుగొట్టే టిడిపి ప్రభుత్వం పీకే దెమీ లేదని ధిలాసా కావచ్చు - దీనికి తోడు కేంద్ర నిధులకు సంభందించిన ఎండ్-యూజ్ సమర్పించకపోవటం టిడిపి నాయకత్వ ఋజువర్తన ప్రశ్నార్ధక మౌతుంది. నిధులు దుబారా,  విపరీత దుర్వినియోగం - అదీ సామాన్యునికి కూడా అర్ధమయ్యేలా జరిగిపోతున్నాయి.  ఉదాహరణకు పి.వి.సింధు ఎపిసోడ్, పుష్కరాల ప్రహసనం. ఇలా డబ్బు తగలేసి ఎండ్-యూజ్ సమర్పించని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎలా నమ్ముతుంది?  దీనితో కలిపి - ఓటు కు నోటు  ద్వారా బాబు గారి "ఇంటిగ్రిటి" నే పెద్ద ప్రశ్నగా మిగిలింది. వైఎసార్ కంటే ఎక్కువ ప్రజాధనాన్ని మూటగట్టుకొనాలనే యావ బాబును సింగపూర్, ఆస్తానా, చైనా, జపాన్, ఇలా ప్రపంచ ప్రదక్షిణ చెయిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. తానకు ధనం, కీర్తి, అధికార యావ తప్ప ఇంకా కనిపించేవి తన కుమారు లోకేష్ కు అధికారం కట్టబెట్టటమే - జీవిత ధ్యేయాలు.  

 

మరో దుర్మార్గమైన ఆయన లక్షణం కీర్తి ఖండూతి. ఏమంచి జరిగినా తనవల్లే అనటం పెద్ద  దుర్మార్గం. ఉదాహరణలు కోకొల్లలు - నాడు సత్య నాదేళ్ళ ఆస్థాయికి చేరటానికి, నేడు పి.వి. సింధు రియో -ఒలంపిక్స్ లో రజత పతకం పొందటానికి, సైబరాబాద్ నగర నిర్మాణం జరగటానికి తానే కారణ మనటం.

 

సత్య నాదేళ్ళ తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకు తనకుమారుణ్ణి ఈ తీరాలకు చేర్చాలో ఆయనకు తెలుసు. పుల్లేల గోపి-చంద్ కు ఆరోజుల్లో బాడ్మింటన్ స్టేడియం నిర్మించటానికి భూమి ఇవ్వటం అనేది ప్రభుత్వ పాలనలో క్రీడల ప్రోత్సాహం క్రిందకు వస్తుంది. అది సహజం. ఈయన చడ్డీలు వేసే రోజుల్లోనే ఏ.బి. స్టేడియం హైదరాబాద్ లో ఉంది. "అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు" - ఎన్నో తెలంగాణా భూములను గద్దలకు, రాబందులకు దానం చేయగా లేనిది ఆఫ్ట్రాల్ గోపీచంద్ స్టేడియం భూమి అలాట్ చేయటం - యాదృచ్చికమే తప్ప పెద్ద దూరాలోచన మాత్రం కాదు. అనుకోకుండా జరిగిన ఒక చిన్న మంచిపని మాత్రమే. ఇందులో కూడా దురాలోచన ఉందంటారు చాలా మంది. క్రీడా స్పుర్తితో దాని వదలివేద్ధాం. గోపీ అందించే ప్రయోజనం ముందు అది చాలా చిన్న విషయం.

 

ఇక సైబరాబాద్ తన ఆస్తుల విలువ, బినామీల వద్ద ఉన్న తన ఆస్తుల విలువ పెంచుకోలేదా? విలువైన తెలంగాణా భూములన్నీ తనవాళ్ళ, తన ఆశ్రితుల, తన కులపోళ్ళ పరంకాలేదస్? సినిమా పరిశ్రమలో తన కులం వల్లు మినహా వేరే వాళ్ళేవరు పైకొచ్చారో చెప్పండి? వేరేవాళ్ళ కెవరికైనా భూపందేరం ఇంతలా చేశారా? అయినా ఆ రోజుల్లో రాజీవ్ గాంధి తెచ్చిన విప్లవాత్మక మార్పుని ఉపయొగించుకొని బంగళురు, పూనా, చెన్నై, అహ్మదాబాద్, నోయిడా, హైదరాబాద్ లాంటి నగరాలు పై కొచ్చాయి. మరి వాటి అభివృద్ధి కూడా బాబు ఖాతాలో వేసుకుంటే సరిపోతుంది. అసలు బాబుకు అభివృద్ధి చేసే సత్తాయే ఉంటే వైజాగ్ ఎందుకు సైబర్ సిటి గా అభివృద్ధి కాలేదు? కొన్ని ప్రాంతాలు కొద్ది ప్రభుత్వ ప్రయత్నంతో ఎదుగుతాయి. అందుకే గా బాబు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఉన్నారు. ఈ అనుభవం చాలు తెలంగాణాకి.

 

తనను తనవాళ్ళ తన ప్రాంత అభివృద్ధి రాష్ట్రాభి వృద్ధి కాదని మనవి. ఎంతమంది అనామకులు అభివృద్ది చెందారు, పేదరికము నుండి పైకొచ్చారు, పాఠశాలలు, ప్రజా వైద్య ఆరోగ్యం, రఒడ్డు, రైల్, వాయు రవాణా, సాగు నీరు, తాగు నీరు సరపరా, మురుగు నీరు పారే వ్యవస్థ, విద్యుత్ పరిశ్రమలకు సౌకర్యాలు అలాంటివేమీ అభివృద్ధి కాలేదేమి? ఆ వైఫల్యాలు బాబు ఖాతాలో లెఖ వేసుకోరా?

 

విజయాలకు బాబుగారు మాత్రమేనా తండ్రి? వైఫల్యాలకు కాంగ్రెస్సా తం డ్రా? రాష్ట్రానికి వచ్చే ఆదాయముతో పోలిస్తే జరిగిన అభివృద్ధి “హస్తి ముందు మశిక మంత” (ఏనుగు ముందు దోమంత ) మాత్రమె. కాంగ్రెస్ గాని, టిడిపి కాని ప్రజలకు ముఖ్యంగా మధ్య తరగతి కి ఒరగబెట్టిందేమీ లేదు. కొన్ని కులాలు, కొందరు వ్యక్తులు, కొన్ని కుటుంబాలు మాత్రమే మిగిలిన వారికి అవకాశాలు అందనివ్వ కుండా అభివృద్ధి చెందారు (యి)


కేసిఆర్ కు చంద్రబాబుకు ఏదో ఒక వ్యాపకం కావాలి ప్రజలమనుసులను అటు డైవర్ట్ చేయటానికి. అదీ మొన్న ముగిసిన పుష్కరాల్లాగా. పుష్కరాలకు ముఖ్యమంత్రులకు గతములో ఎప్పుడూ ఇంతా హంగామాలేదు. అదేదో వ్యక్తిగత దైవ కార్యం. దాన్ని వారు చూసుకుంటారు. దీనికి పోలీసులు ప్రభుత్వ యంత్రాంగముంది వారు కోటానుకోట్ల జీతభత్యాలు తీసుకుంటున్నవారు సరిపోరా!  అయినా పుష్కరాలపై వేల కోట్లు తగలెట్టే ప్రభుత్వాలు, రాష్ట్రాలు పేద రాష్ట్రాలని ఎవరు నమ్ముతారు?    ముఖ్యమంత్రులు ఈవెంట్ మానేజర్లా? నిజంగా వీరు ఇద్దరు చంద్రులు సిఎం స్థాయిని ఈవెంట్ మేనేజర్ స్థాయికి  దిగజార్చారు. ఇక ప్రపంచస్థాయి పాలన అంటే ఈవెంట్లని మానేజ్ చేయటమా? షేం...షేం...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: