మీడియా సమ‌క్షంలో కేసీఆర్ ఏం చెప్ప‌బోతున్నారు?

DSP
చాలా ఏళ్ల తరువాత మ‌రోసారి త‌న మాట‌ల పంజా విసిరారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం రెండేళ్ల పాల‌న‌లో ఆయ‌న ఈ స్థాయిలో ప్ర‌తిప‌క్షాల మీద విరుచుక‌ప‌డ‌టం దాదాపుగా ఇదే మొద‌టి సారిగా చెప్పొచ్చు. మహారాష్ట్ర తో సాగు నీటి ఒప్పందాలు చేసుకున్న అనంత‌రం హైదరాబాద్ కు చేరిన గులాబీ సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. కానీ ఆయ‌న మాటల‌ను గ‌మ‌నిస్తే... కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేశార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న మాట‌ల‌ను ఒక్క‌సారి గ‌మ‌నిస్తే.... "ఉత్త‌మ్ కుమార్ అండ్ కంపెనీ లేని పోని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం, కేసులు పెట్టి జైల్లో చిప్ప‌కూడు తినిపిస్తా, ద‌మ్ముంటే సాక్షాదారాల‌తో బెంగ‌పేట‌కు రా..., నేను 45 నిమిషాలు ఇక్క‌డే ఉంటా... ఆధారాలు తీసుకురా..., ఇక్క‌డి నుంచి డైర‌క్టుగా రాజ్ భ‌వ‌న్ కి వెళ్లి రాజీనామా చేస్తా" అని కేసీఆర్ ఉద్వేగ‌పూరితంగా ప్ర‌సంగించారు.

ఉత్త‌మ్ పై విరుచుకుప‌డ్డ కేసీఆర్....

అంతేకాదు.... మ‌రికొన్ని రోజుల్లో మీ బండారం మొత్తం సాక్షాధారాల‌తో మీడియా ముందుకు వ‌చ్చి మీరు చేసిన మోసాల‌ను ప్ర‌జ‌ల‌ముందు ఉంచి, మిమ్ముల్ని జైల్ పంపిస్తాన‌ని తెలిపారు. ఓ మీడియా ఛాన‌ల్ కుర్చోని మీ జాతకం మొత్తం బ‌య‌ట‌పెడుతాన‌ని స‌వాల్ విసిరారు. ఇప్పుడు అందరి మ‌దిలో కొట్టుమిట్టాడే ప్ర‌శ్న... కేసీఆర్ మీడియా సమ‌క్షంలో ఏం చెప్పుబోతున్నాడు? అని. సీఎం కేసీఆర్ ఈ స్థాయిలో విరుచుకుప‌డ్డాడంటే అందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంటుంది. ఇంత‌కీ ఏం మాట్లాడుతారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా ఏన్నాడు ఈ స్థాయిలో మాట్లాడింది లేదు. కాంగ్రెస్ , టీడీపీ కంపెనీలు ముసుగులు తొల‌గించాల‌న్నారు. ఇక నుంచి రైతులు వ‌ర్షం కోసం ఆకాశం వైపు చూడాల్సిన అవ‌స‌రంలేద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉన్నార‌న్నారు. కాంగ్రెస్ త‌ప్ప‌, 148 మీట‌ర్ల కి తుమ్మిడిహ‌ట్టి ఒప్పందం జ‌రిగింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారన్నారు. 

మ‌హారాష్ట్ర తో ఒప్పందం చారిత్ర‌కమేనన్న గులాబీ నేత...

కేసీఆర్ జ‌గ‌మెండీ , మీలా తోక‌లు మువ‌లేదు. తెలంగాణ కోసం త్యాగాలు, రాజీనామా లు చేసిన పార్టీ టీఆర్ఎస్. ఆరు నూరైనా స‌రే తెలంగాణ రైతుల‌కు నీరందిస్తామ‌ని కేసీఆర్ అన్నారు. మ‌హారాష్ట్ర‌తో ఒప్పందం మ‌న రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బ‌డుతుందని అన్నారు. చిర‌కాలం నీళ్లందించే వ‌ర‌ప్ర‌దాయిని ఈ ఒప్పందం అని వ్యాఖ్యానించారు. ఈ రోజు తెలంగాణ గోస‌కు కారకులు ఏవ‌రు?  బాధ్యులు ఏవ‌రు? 60 ఏళ్ల నాడు అస్థిత్వంతో , ఆత్మ‌గౌర‌వంతో ఉన్న తెలంగాణ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌లిపిందే మీ కాంగ్రెస్ పార్టీ. ఆ త‌రువాత దేవునూరు ప్రాజెక్టు ను అభాండం చేస్తుంటే...అప్ప‌ర్ కృష్ణా ప్రాజెక్టును  ఆగం చేస్తుంటే... నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు సైట్ మార్చి, నందికొండ ప్రాజెక్టు పేరును నాగార్జున‌సాగ‌ర్ చేసి తెలంగాణ కు నీళ్లు రాకుండా చేస్తుంటే మౌనంగా ప్రేక్ష‌క పాత్ర వ‌హించిందే మీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

కేసీఆర్ విరుచుకుపడ్డ ఉత్త‌మ్, జానా....

ఇక‌పోతే... కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌త రెండు రోజుల నుంచి మ‌హారాష్ట్ర ఒప్పందం చారిత్ర‌క మోసమంటూ విమర్శలు గుప్పిస్తోంది. తుమ్మిడి హ‌ట్టి వ‌ద్ద 152 మీ ఎత్తుతో ప్రాణ‌హిత ప్రాజెక్టు ను రూ. 38 వేల కోట్ల‌తో నిర్మించి తెలంగాణ జిల్లాల‌కు గ్రావిటీ ద్వారా నీరందించాల‌ని నిర్ణ‌యిస్తే కేసీఆర్ ప్ర‌భుత్వం మాత్రం ...148 మీ ఎత్తుకు ప‌రిమితం చేసి ప్రాజెక్టు వ్య‌యాన్ని రూ. 83 వేల కోట్ల‌కు పెంచింద‌ని కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ చైర్మ‌న్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీనియ‌ర్  నేత జానారెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట‌ర్ల‌ తో కుమ్మ‌క్కైన కేసీఆర్ మ‌హారాష్ట్ర లో 3 వేల ఎక‌రాల ముంపున‌కు ఒప్పించ‌కుండా ప్రాజెక్టు వ్య‌యాన్ని పెంచి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేశార‌న్నారు. క‌మీష‌న్ల క‌క్కుర్తి తోనే రీడిజైనం టూ అంచ‌నా వ్య‌యాన్ని పెంచేసి ప్ర‌భుత్వం వేల కోట్ల అవినీతి కి పాల్ప‌డుతోంద‌న్నారు.

త్వ‌ర‌లో మీడియా ముందుకు కేసీఆర్....

అయితే ఇక్కడ సీఎం  కేసీఆర్ మాత్రం అలాంటిదేమీలేదు. 152 మీట‌ర్ల‌కే ఒప్పందం కుదిరింద‌ని తేల్చి చెప్పేశారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఆడుతున్న మోసపూరిత ప‌నుల‌ను సాక్షాధారాల‌తో అతి త్వ‌ర‌లో ఓ చానల్ ముందుకు వ‌చ్చి 4 గంట‌ల స‌మ‌యం కేటాయించి మ‌రీ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాన‌ని, అంతేకాకుండా ఒక్కొక్క‌రికి జైల్ కూడు తినిపిస్తాన‌ని హెచ్చ‌రించారు. ఇక‌పోతే... సీఎం కేసీఆర్ ఏ ఆధారాల‌తో మీడియా ముందుకు వస్తారోన‌ని తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్ష‌నాయకులు ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు. మ‌రీ కేసీఆర్ మీడియా ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: