ఏపీ.. అన్నింట్లోనూ వైఫల్యాలే.. రిపోర్ట్ చెప్పేసింది..!

Chakravarthi Kalyan
ప్రణాళికాశాఖ దేశంలోని అన్ని రాష్ట్ర్రాల పనితీరును అంచనా వేస్తుంది. అవి అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించి రేటింగులు ఇస్తుంది. ప్రణాళికాశాఖ  గతేడాది ఏపీ పనితీరుపై ఇచ్చిన నివేదికలో ఏపీ అన్ని విషయాల్లోనూ ఫెయిలైనట్టే తేలిందని ఓ పత్రిక తన కథనంలో పేర్కొంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి లక్ష్యాలకు ఆమడ దూరంలోనే నిలిచిందట. 

ముఖ్యంగా వ్యవసాయం, సంక్షేమంలో లక్ష్యాలకు దూరంగా ఏపీ ఫలితాలు ఉన్నాయట. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న 9 మిషన్ల లక్ష్యాలు, పనితీరు, ఫలితాల సాధన ఆధారంగానే ఈ రేటింగ్‌లు ఇచ్చారట. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చివరకు రాష్ట్రప్రభుత్వం పనితీరు ఆధారంగా రేటింగ్‌లిచ్చింది.

అన్నింట్లోనూ ఫెయిల్యూర్లే..!



వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగ మిషన్ కింద, సంక్షేమ రంగాన్ని సాంఘిక మిషన్‌గా పరిగణిస్తూ రేటింగ్‌లివ్వగా.. ఈ రెండు రంగాల్లో రేటింగ్‌లు వైఫల్యాల్నే సూచిస్తున్నాయి. ప్రణాళికాశాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు బుధవారం నుంచి నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులో సమీక్షిస్తారట. తొమ్మిది రంగాల మిషన్లకు కలపి మొత్తం 1,036 అంశాల్లో రేటింగ్ ఇచ్చారు. 

ఈ రేటింగుల్లో సగానికిపైగా అంటే 533 అంశాల్లో పనితీరు సంతృప్తికరంగా లేదని నివేదిక తెలిపింది. 399 అంశాల్లో పనితీరు సంతృప్తికరంగా లేదంది. 134 అంశాల్లో సంతృప్తికరమంది. 123 అంశాల్లో పనితీరు బాగా ఉందని, 380 అంశాల్లో పనితీరు చాలా బాగా ఉందని తెలిపింది. వ్యవసాయ రంగానికి సంబంధించి సూక్ష్మ పోషకాలను 16,09,730 హెక్టార్లకు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 6,10,442 హెక్టార్లకు మాత్రమే సరఫరా చేశారు. ఇది కేవలం 38 శాతం మాత్రమే. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: