గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంగతి అందరికీ తెలిసిందే. ఆయన చాలా రఫ్ గా ఉంటారు. మాట తీరు కూడా అంతే. మొన్నటికి మొన్న జగన్ దీక్షా వేదికపై నుంచి ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. జగన్ పై తరచూ విమర్శలు కురిపించే చంద్రబాబు, దేవినేని ఉమలపై నాని విరుచుకుపడ్డారు.
దేవినేని, చంద్రబాబుల చర్మంతో జగన్ కు చెప్పులు కుట్టిస్తానంటూ నాని చేసిన కామెంట్లు కలకలం రేపాయి. చంద్రబాబుతో పాటు లోకేశ్ పైనా సీరియస్ కామెంట్లు చేశారు. ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా టీడీపీ నేతలు దేవినేని ప్రెస్ మీట్ పై స్పందిస్తున్నారు. జగన్ ను విమర్శించే విషయంలో ముందువరుసలో ఉండే వర్ల రామయ్య ఇప్పుడు కొడాలిన నానిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని, నారా లోకేష్ లపై కొడాలి నాని వాడిన పదజాలం సభ్యత,సంస్కారం లేనివి గా ఉన్నాయని వర్ల మండిపడ్డారు. కొడాలి నాని తాజా వ్యాఖ్యలు చూశాక గుడివాడ నియోజవర్గ ప్రజానీకం సిగ్గుపడతారని వర్ల అంటున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన పోలిక కూడా చెప్పారు.
కొడాలి నాని మొదట తెలుగు దేశం పార్టీలోనే ఉన్నారు. వైఎస్సార్ సీపీ పెట్టిన తర్వాత అటువైపు మొగ్గారు. ఈ అంశం ఆధారంగా చేసుకుని.. కొడాలి నానిని గంజాయితో పోల్చారు వర్ల రామయ్య. తెలుగుదేశం పార్టీ అనే తులసి వనంలో పుట్టి... వైఎస్‌ఆర్ పార్టీలో గంజాయి మొక్కగా మారారని ఆరోపించారు. 11 అవినీతి కేసులలో ఏ1 ముద్దాయిగా ఉన్న మీజగన్మోహనరెడ్డి దోపిడీ దారుడు, దొంగబ్బాయని, కొడాలినాని గుర్తించాలని అన్నారు.