బుల్లి పిట్ట: మార్కెట్లోకి హోండా ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే..?

Divya
ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థలలో ఒకటైన హోండా బైక్స్ కొనడానికి చాలామంది మక్కువ చూపిస్తుంటారు. ముఖ్యంగా ఈ కంపెనీకి చెందిన వాహనాల ఇంజన్ సౌండ్ తక్కువగా ఉండడం వల్ల చాలామంది కొనడానికి మక్కువ చెపుతున్నారు. అయితే ఇంతకాలం పెట్రోల్ వేరియంట్ లో వచ్చిన హోండా షైన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా అడుగు పెట్టబోతోంది. ఇందుకు సంబంధించి కొన్ని లీకులు ఆన్లైన్లో లీక్ అవ్వగా అవి మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.


హోండా షైన్ ఎలక్ట్రిక్ బైక్స్ ప్రత్యేకమైన ఫీచర్స్ ఉండబోతున్నట్లు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మైలేజ్ విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండనుంది. అయితే ఈ బైక్ 2028 లోపు ఎప్పుడైనా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. హోండా షైన్ ఈవి బైక్ డిజైన్ పూర్తిగా నిటారుగానే ఉండనుంది. ఈ బైక్ మీద ప్రయాణం చేసే వారికి ఎలాంటి అలసట ఉండదు. అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ విభిన్నంగా అమర్చారు. ఎలాంటి వాతావరణం లోనైనా ఎలాంటి పరిస్థితులలో నైనా లైట్స్ చాలా క్లియర్ గా కనిపించేలా ఉంటాయి.

అలాగే బైక్ డ్యూయల్ రిమూవల్ లిథియం బ్యాటరీ తో ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. గేర్ షిఫ్టు లేదా ఇంజన్ వైబ్రేషన్ లేకుండా సాఫీగా ప్రయాణం చేసుకోవచ్చు. రోజువారి ప్రయాణం చేసే వారికే కాకుండా లాంగ్ డ్రైవ్ వెళ్లారనే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే కలదు. ఇందులో బ్యాటరీ శాతం, రైడింగ్ మోడ్, ట్రిప్ డీటెయిల్స్, మొబైల్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ నోటిఫికేషన్ మరికొన్ని డిస్ప్లే లో కనిపిస్తాయి. అయితే ఈ బైక్ మార్కెట్ లోకి వస్తే ధర రూ. 1.30 లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు నిపుణులు. మరి ఈ విషయం పైన హోండా షైన్ సంస్థ ఎటువంటి ప్రకటన చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: