ఏపీ: ఆడబిడ్డ నిధి పథకంపై.. మంత్రి కీలక ప్రకటన.. అర్హతలు ఇవే..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నీది పథకాన్ని, నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామంటూ గత కొద్ది రోజులుగా చెబుతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఈ పథకాలకు సంబంధించి ఎటువంటి ఊసే ఎత్తలేదు. తాజాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని, 2024 ఎన్నికలలో జూన్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారని శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే ఈ రెండేళ్లలో మహిళలకు 36వేల రూపాయలు బాకీ పడ్డారని ప్రశ్నించారు. ఈ పథకం అమలుపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక కీలకమైన ప్రకటనను చేశారు. ప్రస్తుతం ఈ పథకం పై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేయాలని ఆ దిశగానే అడుగులు వేస్తున్నామంటూ తెలిపారు.


గతంలో చెప్పినట్టుగా వృద్ధాప్య పింఛన్లను మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంచామని గుర్తు చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆడబిడ్డ నిధి పథకంలో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 రూపాయలు అందించబోతున్నామని, అంటే ఒక్కో మహిళకు ఏడాది రూ .18 వేల రూపాయలు చొప్పున అందించబోతున్నామని, 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళా కూడా అర్హులే అంటూ తెలిపారు. ఈ పథకం కుటుంబ ఆదాయ పెరుగుదలకు లక్ష్యంగానే ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


ఈ పథకం కోసం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, రెసిడెన్స్ సర్టిఫికెట్, వయసుకు సంబంధించిన నిర్ధారణ పత్రాలు , మరికొన్ని  వివరాలను  సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ https://ap. gov. Inlaadabiddanidhi వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి .

అక్కడ ఆన్లైన్ ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది..

దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు మాత్రమే అర్హులు.

దరఖాస్తు తేదీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడమే ముఖ్య లక్ష్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: