జిల్లా వైసీపీ సమావేశం విజయవంతం చేయాలి
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ ) . . .
జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ నెల 15న జరిగే వైసీపీ జిల్లా స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కంభం విజయరాజు పార్టీ నాయకులకు పిలుపు ఇచ్చారు. శుక్రవారం మండలంలోని రావికంపాడు గ్రామంలో వైసీపీ నాయకులు యేసు ఇంటి దగ్గర మండల నాయకులతో ఆయన చర్చించారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చింతలపూడి నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరు కావాలన్నారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని . . . ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందని .. మరో రెండేళ్లు కష్టపడితే మనం అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా విజయరాజు కార్యకర్తల కు సూచించారు.
ప్రతి ప్రజా వ్యతిరేక అంశం పై కూడా కార్యకర్తలు అందరూ సమష్టిగా పోరాటం చేసి పార్టీ వాయిస్ ప్రజల్లో బలంగా వినిపించాలని విజయరాజు పార్టీ కేడర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాయంకుల సత్య నారాయణ , పార్థసారధి , సర్పంచ్ దేవరపల్లి రామ్మోహన రావు , గుర్రాల రవికుమార్ , ప్రసాద్ రెడ్డి , మేరుగు బాబురావు , కొమ్మిన నరేష్ , రఘుపతి రెడ్డి , అంజిరెడ్డి , యేసుపాదం , మోహనరావు , శిరిశెట్టి సిద్దిరాజు , అచ్చియ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.