కోటలో వైసీపీ కోటి సంతకాలకు అదిరే రెస్పాన్స్
- కూటమి ప్రభుత్వంపై యేడాదిన్నరకే వ్యతిరేకత
- ప్రభుత్వం మెడికల్ కాలేజ్‌ల ప్రైవేటీకరణ విరమించుకోవాలి
- మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని ఆలోచన చేస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కంభం విజయరాజు ఆదేశాల మేరకు మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో కామవరపుకోట మండలంలో కోటి సంతకాల సేకరణ ప్రతి పంచాయతీలోనూ జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా రాయంకుల మాట్లాడుతూ పార్టీ కన్వీనర్ కంభం విజయరాజు ఆధ్వర్యంలో మండలంలో ఇప్పటికే 9 వేలకు పైగా సంతకాలు సేకరించి .. వాటిని డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. మండల వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించిందన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా తరలి వచ్చీ మరీ ఈ కోటి సంతకాల సేకరణలో పాల్గొని వైసీపీ ప్రభుత్వాన్ని తాము మళ్లీ కోరుకుంటోన్న విషయాన్ని తెలుపుతున్నారని రాయంకుల తెలిపారు.
సంతకాల సేకరణకు సహకరిస్తోన్న ప్రతి వైసీపీ నాయకుడు, కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ స్పందన చూస్తుంటే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందని.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన ఇప్పటకి అయినా ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. బుధవారం ఈ సంతకాల పత్రాల ను చింతలపూడి లో కన్వీనర్ విజయరాజు సమక్షంలో రిలీజ్ చేసి.. తర్వాత పార్టీ నాయకత్వానికి అందజేస్తామన్నారు. చింతలపూడి కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపుఇచ్చారు. అలాగే జిల్లా స్థాయిలో ఈ నెల 15న ఏలూరులో జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని రాయంకుల పిలుపు ఇచ్చారు.