ప్రపంచకప్ విజేతగా నిఖత్ జరీన్.. రేేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం?
రింగ్‌లో ఆమె చూపిన ధైర్యం, నైపుణ్యం, పట్టుదల భారత దేశ కీర్తి ప్రతిష్ఠలను నలుదిశలా వ్యాపింపజేశాయని తెలిపారు. తెలంగాణ అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో ఇలా రాణిస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ గర్వంగా భావిస్తున్నారని ప్రశంసలు కురిపించారు.ఈ విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు పెద్ద ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. క్రీడల్లో రాణించాలని కలలు కనే ప్రతి యువతీ యువకుడూ నిఖత్ జరీన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కష్టపడితే ఏ శిఖరమైనా అధిరోహించవచ్చనే సందేశం ఈ స్వర్ణ పతకం ఇస్తోందని పేర్కొన్నారు.భవిష్యత్తులో నిఖత్ జరీన్ ఇంకా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను, తెలంగాణను గర్వపడేలా చేస్తుందని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆమె విజయాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. గ్రేటర్ నోయిడా లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో నిక్కత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ నిక్కత్ జరీన్ మరోసారి తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.నిఖత్ సాధించిన ఈ ఘనత తెలంగాణ క్రీడా రంగానికి కొత్త ఉత్తేజాన్ని నింపింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు