విజయ్ త్రిషలను కలిపింది ఆ హీరో హీరోయినేనా.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Pandrala Sravanthi
ఏంటి విజయ్ త్రిషలు ప్రేమలో పడడానికి కారణం ఆ హీరో హీరోయిన్ లా..ఆ సెలబ్రిటీల వల్లే విజయ్ త్రిష మధ్య ప్రేమ బంధం చిగురించిందా.. ఇంతకీ విజయ్ త్రిషలను కలిపిన ఆ సెలబ్రిటీలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ త్రిషల మధ్య బంధం ఈనాటిది కాదు.వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తున్నప్పటి నుండే కొనసాగుతోంది.ముఖ్యంగా ప్రభాస్ త్రిషని పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో త్రిషకి విజయ్ తో ఉన్న రిలేషన్ తెలియడంతో ప్రభాస్ త్రిషని పెళ్లి చేసుకోలేదనే టాక్ ఎప్పటినుండో నడుస్తోంది. అయితే అలా అని త్రిష విజయ్ ని కూడా పెళ్లి చేసుకోలేదు . ఇప్పటికి సింగిల్ గానే ఉంది. కానీ విజయ్ సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకుల వరకు వచ్చారు.


 ఇక వీరి విడాకులకు కారణం కూడా త్రిషనే.రీసెంట్ గానే సంగీత విజయ్ తో విడాకులు కోరుతూ నటితో ఎఫైర్ వల్లే విడాకులు తీసుకుంటున్నానని స్పష్టం చేసింది. ఇక ఆ నటి ఎవరంటే త్రిష అని అందరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రూమర్స్ ని నిజం చేస్తూ త్రిషతో కలిసి విజయ్ ఓ పెళ్లిలో పాల్గొన్నారు. దీంతో కోలీవుడ్ మొత్తం వీరి రిలేషన్ గురించి కథకథలుగా మాట్లాడుకున్నారు.ఇదంతా పక్కన పెడితే త్రిష విజయ్ ల మధ్య లవ్ చిగురించడానికి ప్రధాన కారణం జ్యోతిక విక్రమ్ లేనట.. అవును మీరు వినేది నిజమే.జ్యోతిక విక్రమ్ ల వల్లే వీరి మధ్య ప్రేమ చిగురించిందట. అయినా జ్యోతిక విక్రమ్ లు విజయ్ త్రిషల ప్రేమకు ఎలా కారణం అని మీ అందరికీ ఓ డౌట్ రావచ్చు.


అయితే విజయ్ త్రిష ప్రేమ బంధం చిగురించింది గిల్లీ సినిమాతో.. అయితే ఈ సినిమా కోసం మొదట డైరెక్టర్ హీరో హీరోయిన్లుగా విక్రమ్ జ్యోతికలని అనుకున్నారట. కానీ ఈ ఇద్దరు ఆ సమయంలో చాలా బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో త్రిష విజయ్ ని పెట్టి సినిమా చేశారట.అలా ఈ సినిమా చేయడంతో వీరి మధ్య లవ్ చిగురించింది.ఒకవేళ విక్రమ్ జ్యోతిక లు ఈ సినిమా చేస్తే విజయ్ త్రిషల మధ్య ప్రేమ చిగురించేది కాకపోవచ్చు. అలా పరోక్షంగా జ్యోతిక విక్రమ్ ల వల్లే విజయ్ త్రిషల మధ్య ప్రేమ చిగురించింది అంటూ తాజాగా విజయ్ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న వేళ ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: