మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త రేట్లు రాబోతున్నాయా..?

frame మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త రేట్లు రాబోతున్నాయా..?

Divya
మందుబాబులకు సైతం మద్యం మరింత సులువుగా లభించనుంది .తక్కువ ధరలకు మద్యం ధరలు తీసుకువచ్చేలా ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలకు మించి మరి మధ్య అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఖజానా కూడా భారీగా నింపడంతో ఇదే సమయంలో మరికొంత కొత్త ఆలోచనలతో అమ్మకాలు మరింత ఊపునివ్వడానికి ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న బ్రాండ్లకు అదనంగా కొత్త బ్రాండ్లను సైతం తీసుకువచ్చేలా చేయబోతున్నారట.


అలాగే వీటి అమ్మకాలలో కూడా మార్పులను తీసుకువచ్చేలా ప్రతిపాదనలు చేయబోతున్నట్లు సమాచారం. దీనివల్ల మద్యం ధరలు కూడా తగ్గనున్నాయి. ఎక్స్చేంజ్ అధికారులు మద్యం అమ్మకాలలో సరికొత్త ప్రతిపాదనలను సైతం సిద్ధం చేస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఎక్స్చేంజ్ శాఖ కర్ణాటక తరహాలో టెట్రా ప్యాకెట్లలో ఇకమీదట మద్యం మందు బాటిలోకి తీసుకువచ్చేలా చూస్తున్నారట. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను సైతం  తీసుకువచ్చేలా సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


60 ఎం.ఎల్, 90 ఎం.ఎల్, 180 ఎంఎల్ వంటి ప్యాకెట్లను కూడా త్వరలో సిద్ధం చేయబోతున్నారట. సీసాలో దొరికే మద్యం కంటే టెట్రా ప్యాకెట్లలో లభించే మద్యం ధర తక్కువగా ఉంటుంది.అంటే ప్రస్తుతం రాష్ట్రంలో క్వాటర్ చీఫ్ లింకర్ 120 రూపాయలు ఉండగా ట్రేటా ప్యాకెట్ లోకి మారితే 100 రూపాయలకే లభిస్తుందనీ ఎక్సేంజ్ అధికారులు తెలియజేస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని ప్రతిపాదనలను కూడా ఎక్స్చేంజ్ శాఖ అధికారులకు పంపించాలని ప్రభుత్వం ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రంలో ప్యాకెట్ల మద్యం విక్రయాలు మొదలు కాబోతున్నాయట.


ఇప్పటికే రాష్ట్రంలో 2620 వైన్ షాపులు ఉండగా..1117 బార్లు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ మార్గ 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతున్నది.. కర్ణాటకలో మేక్ డోవెల్స్ అన్నిటినీ కూడా 90% వరకు టెట్రా ప్యాకెట్లలోని సేల్స్ జరుపుతున్నారట ఇదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నారు ఇందుకోసం రెండుసార్లు ఎక్స్చేంజ్ శాఖ ఉన్నత అధికారులతో కూడా మాట్లాడారట. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి కూడా వినియోగదారునికి లాభం చేకూరుతుంది. మరి ఏంటన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: