ఏపీ: రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్..!

frame ఏపీ: రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్..!

Divya
చాలామంది అధికారులు పదవి విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని చూస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన వారు చాలామందే ఉన్నారు. అలా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు కూడా తెలియజేయడం జరిగింది. కాళ్లు చేతులు ఆడినంతవరకు తాను సమాజం కోసమే పని చేస్తానని ఉద్యోగ విరమణ సమయంలో ఈ అధికారి తెలియజేశారు. అయితే ఇటీవలే అమలాపురంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రజలకు మెరుగైన భవిష్యత్తు కోసమే తాను ప్రయత్నిస్తూ ఉంటారని వెల్లడించారు.


ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన కూడా విమర్శలు చేయడం జరిగింది.. వైసిపి పార్టీ గత ఐదేళ్లలో విధ్వంసం సృష్టించారని రాష్ట్రాన్ని దెబ్బతీసింది అంటూ తెలుపడమే కాకుండా వైసిపి నేతలకు ఆంధ్రాలో గౌరవమే లేదంటే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి ప్రమాదం అంటూ రాజకీయాలు అంటే కేవలం సంపద అంటూ ఎద్దేవ చేశారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన విధ్వంసం గురించి అంతా ఇంతా కాదు అంటూ.. జగన్మోహన్ రెడ్డి వల్ల ఐదేళ్లు తన విలువైన సమయాన్ని కోల్పోయాను అంటూ తెలిపారు.


వైసిపి పార్టీలో అక్రమాలు చేసే వారికే పెద్ద పీఠం.ప్రజలకు కులాల వర్గాలుగా విడదీస్తూ ఉన్నారని జగన్ కోసం బలైన మొదటి వ్యక్తి కోడి కత్తి శ్రీను అంటూ వెల్లడించారు.. ఐదేళ్లుగా అతను జైల్లోనే ఉన్నారని తెలిపారు. సాక్ష్యం చెప్పకుండా జగన్ నీరు గార్చే ప్రయత్నం అయితే వెల్లడిస్తూ ఉన్నారని తెలిపారు
 ఇంటిలిజెన్స్ మాజి చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు.. తాను జగన్ వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ కూడా అండగా ఉంటానని తెలిపారు. అలాగే జగన్ అక్రమాలు, అన్యాయాలు కూడా బయట పెడతానని తాను కూడా పోరాడుతానని అందుకు అందరూ సహకరించాలని తెలియజేశారు. మరి పొలిటికల్పరంగా సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: