
బైరెడ్డి శబరి దిమ్మతిరిగే ట్విస్ట్.. ఆ ఎయిర్‌పోర్ట్ గురించి రచ్చ..?
దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులను గౌరవించుకోవడం తప్పుకాదు, కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ వేరే ఉంది. బైరెడ్డి శబరి కోరుతున్న పేరు ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ పేరుతో ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్ రెడీ అయిపోయింది. వైసీపీ ప్రభుత్వం ఏకంగా జీవో కూడా ఇచ్చేసింది, అది కూడా ఇప్పుడో కాదు, 2021 మే 16నే
ఇంకా హైలైట్ ఏంటంటే, స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి మరీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇదంతా జరిగిపోయింది, కానీ బైరెడ్డి శబరికి ఈ విషయం తెలియదా? లేక తెలిసినా తెలియనట్టు డ్రామా క్రియేట్ చేస్తున్నారా? రామమోహన్ నాయుడుకి ఆమె వినతిపత్రం ఇవ్వడం, ఆ తర్వాత జగన్ ఆవిష్కరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తుంటే, అసలు కథ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలన్న జగన్ సర్కార్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకుందా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకం. ఒకవేళ కేంద్రం ఓకే అనకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేరు పెట్టేసి హడావిడి చేసిందా? లేక కేంద్రం కూడా సైలెంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఈ మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. బైరెడ్డి శబరి వినతిపత్రం వెనుక అసలు మతలబు ఏంటో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా ఈ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది.