స్టార్‌డమ్ కంటే మానవత్వం గొప్పది! మరోసారి నిరూపించిన హీరో సూర్య

Amruth kumar
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. షూటింగ్ సెట్స్‌లో తన తోటి నటుడి కుమారుడికి విలువైన బహుమతిని అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ప్రస్తుతం సూర్య, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సూర్య 46' (Suriya 46) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌లో సూర్య తన తోటి నటుడి పట్ల చూపించిన ప్రేమాభిమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో సూర్యతో కలిసి నటుడు చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.



 చరణ్ కుమారుడు చర్విక్ మొదటి పుట్టినరోజు సందర్భంగా, సూర్య ఆ చిన్నారికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ సెట్‌లోనే ఆ చిన్నారి మెడలో స్వయంగా సూర్య బంగారు గొలుసు వేసి ఆశీర్వదించారు. చిన్నారిని ఎత్తుకుని సూర్య ముద్దాడిన దృశ్యాలు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. "లెజెండరీ యాక్టర్ సూర్య గారి నుండి ఇది ఒక అద్భుతమైన సర్ ప్రైజ్. నా కొడుకు చర్విక్ ఫస్ట్ బర్త్ డేకి ఆయన ఇచ్చిన ఈ గిఫ్ట్ కు మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం" అని ఎమోషనల్ అయ్యారు.సూర్య నటించిన ఇటీవలి చిత్రాలు 'కంగువ', 'రెట్రో' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, 'సూర్య 46' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, భవాని స్రే ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.వచ్చే ఏడాది వేసవి (Summer 2026) కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.



సూర్య చిన్నారికి చైన్ వేస్తున్న వీడియో చూసిన నెటిజన్లు "రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సూర్య తన సింప్లిసిటీతో, తోటి నటుల పట్ల చూపే గౌరవంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ తాజా ఘటన ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించింది.సినిమా షూటింగ్ ఒత్తిడిలోనూ తోటి నటుల ఆనందాన్ని పంచుకోవడం సూర్యకే చెల్లింది. ఈ 'సూర్య 46' చిత్రం ఆయనకు భారీ విజయాన్ని అందించాలని కోరుకుందాం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: