జగన్ గుర్తుకొస్తున్నారా.. ఏపీ జనాలేమనుకుంటున్నారు...!
అంతేకాదు.. జగన్ హయాంలో ఇంటి వద్దే అన్ని పనులు జరిగేవని, ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్టు చెబుతున్నారు. అంతేనా.. అవినీతిపై మెజారిటీ ప్రజలు భగ్గు మంటున్నారు. పోలీసుల ఉదాశీనతను కూడా వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎక్కువ మంది చెప్పడం గమనార్హం. ఇదేసమయంలో కూటమి ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ పాలనపైనా అభిప్రాయం సేకరించిన సర్వే సంస్థ.. ఇది ఎలా ఉందని ప్రశ్నించింది.
చిత్రం ఏంటంటే.. వాట్సాప్ పాలన ఉందన్న విషయం తమకు తెలియదని, దానిని ఎలా వాడుకోవాలో కూడా అర్ధం కావడంలేదని 82 శాతం మంది ప్రజలు కుండబద్దలు కొట్టారు. ఇది వాస్తవం. అయితే.. దీనిని ఎక్కువ మంది వినియోగించుకోవడం లేదని తెలిసింది. ఇక, అవినీతి విషయంలో మాత్రం ఎక్కువగా రియాక్షన్ వచ్చింది. తమకు సంక్షేమ ఫలాలు అందడం లేదని 52 శాతం మంది ప్రజలు చెప్పారు. అదేసమయంలో సామాజిక భద్రతా పింఛన్ల విషయంలోనూ రూ.200లకు తగ్గకుండా.. ఓ పార్టీ నాయకులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు.
వైసీపీ బెస్టేనా? అన్న ప్రశ్నకు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. జగన్ మంచి నాయకుడు అని ఎక్కువ మంది చెప్పినట్టు తెలిసింది. కానీ, ఆయన ప్రజల మధ్యకు రావడం లేదన్న ప్రశ్నకు మాత్రం.. సమయం చూసుకుని ఆయనే వస్తాడు.. వీళ్లకు సమయం ఇవ్వాలికదా? అని 72 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. నాయకుల విషయంలో 52 శాతం మంది ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారన్నది సర్వే సంస్థ చెప్పిన విషయం. ఏదేమైనా ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు బహిర్గతం అవుతాయో.. లేదో చూడాలి.