దేవినేని ఉమా పాలిట టీడీపీలో ఇద్ద‌రు విల‌న్లు ?

frame దేవినేని ఉమా పాలిట టీడీపీలో ఇద్ద‌రు విల‌న్లు ?

RAMAKRISHNA S.S.
మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరుగులేని లీడ‌ర్‌... మ‌రీ ముఖ్యంగా చంద్రబాబు ఉమాను ఎంతో నమ్మేవారు. ఆయ‌న ఏం చెపితే కృష్ణా జిల్లా టీడీపీలో అదే జ‌రిగేది. ఉమా అంటేనే కృష్ణా టీడీపీ .. కృష్ణా టీడీపీ అంటే ఉమా అన్న‌ట్టుగా న‌డిచేది. 1999 ఎన్నిక‌ల నుంచి 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు తానై వ‌న్ మ్యాన్ షోతో న‌డిపించారు. నాలుగుసార్లు ఓట‌మి లేకుండా గెల‌వ‌డంతో కృష్ణా జిల్లా తెలుగుదేశంలో ఆయ‌న హ‌వా అంతా ఇంతా కాదు అన్న‌ట్టుగా ఉండేది. చివ‌ర‌కు సొంత పార్టీలో అంద‌రూ ఉమా ఒంటెద్దు పోక‌డ‌ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించినా అటు చంద్ర‌బాబు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన క‌మ్మ నేత కావ‌డంతో ఎవ్వ‌రూ నోరెత్తి విమ‌ర్శించే వారు కాదు.

నందిగామ నుంచి 1999, 2004లో నందిగామ నుంచి ఆ త‌ర్వాత 2009, 2014లో మైల‌వ‌రం నుంచి గెలిచారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప‌దేళ్లు ఉమా చేసిన పోరాటం చంద‌బ్రాబుకు ఎంతో న‌చ్చింది అందుకే ఉమాకు 2014లో పార్టీ గెలిచాక కీల‌క‌మైన భారీ నీటి పారుద‌ల శాఖా మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఉమా క్రేజ్ అటు పార్టీలోనూ.. ఇటు జిల్లాలో త‌గ్గుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు 2019 ఎన్నిక‌ల నాటికి ఉమాకు ఎమ్మెల్యే సీటే రాలేదు. మ‌రీ దారుణం ఏంటంటే త‌న కుటుంబానికి చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ 2019లో త‌న‌పై వైసీపీ నుంచి గెలిస్తే ఆయ‌నకు చంద్ర‌బాబు టీడీపీ కండువా క‌ప్పి ఆయ‌న‌కు టీడీపీ సీటు ఇచ్చారు.

ఇక ఎమ్మెల్సీ వ‌స్తుంద‌ని అనుకున్నా ఆయ‌న కు ఆ ప‌ద‌వి ఇప్పుడే రాకుండా జిల్లాకే చెందిన ఇద్ద‌రు సొంత పార్టీ నేత‌లు చ‌క్రం తిప్పిన‌ట్టు టాక్ ?  విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఇద్ద‌రూ చ‌క్రం తిప్పి ఉమాకు ఎమ్మెల్సీ రాకుండా చేశార‌న్న టాక్ జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. ఉమాకు ఇప్పుడే ఎమ్మెల్సీ ఇస్తే జిల్లాలో మైల‌వ‌రం , నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉమా గ్రూపు మ‌ళ్లీ రెచ్చిపోతుంద‌ని .. అది పార్టీకి ఇబ్బంది అవుతుంద‌నే వ‌సంత‌, కేశినేని ప్ర‌స్తుతానికి ఆయ‌న‌కు ప‌ద‌వి రాకుండా ఆపార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: