రంగం ఏదైనా రాములమ్మ దిగితే వార్ వన్ సైడే..!!

frame రంగం ఏదైనా రాములమ్మ దిగితే వార్ వన్ సైడే..!!

murali krishna
గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా విజయశాంతి ఓ వెలుగు వెలిగారు.టాలీవుడ్ లేడీ అమితాబ్ గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసేవిధంగా విజయశాంతి ఊహించని స్టార్ డం అందుకున్నారు.. హీరో పాత్రలకి ఏ మాత్రం తగ్గకుండా హీరోయిన్ పాత్రల స్థాయిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత విజయశాంతి కే సొంతం.తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటన ఎన్నో విభిన్న పాత్రలతో విజయశాంతి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.సినిమా రంగంలోనే కాకుండా ఇటు రాజకీయ రంగంలోనూ విజయశాంతి తనదైన ముద్ర వేశారు.తెలంగాణ పోరాటంలో ఆమె స్థానం ఎంతో ప్రత్యేకం.పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు సాకారం అవ్వడం కోసం ఆమె విశేష కృషి చేసారు.1998 లో రాజకీయ అరంగ్రేటం చేసిన విజయశాంతి ముందుగా భారతీయ జనతా పార్టీలో చేరారు.విజయశాంతి బీజేపీ లో చేరడంతోనే ఆ పార్టీ మహిళా విభాగానికి ఆమె కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1999 లో బీజేపీ విజయానికి రాములమ్మ ఎంతగానో కృషి చేసారు..అప్పట్లో ఆమె రాజకీయాలకి కొత్త కావడం ,లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపు వుండడటంతో ఆమె సభలకు మంచి జనాధరణ లభించింది..

అయితే నాటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో 2009 లో "తల్లి తెలంగాణ" పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమె ఉద్యమించారు.తెలంగాణ సాధన కోసం ఒకే వేదికపై కొట్లాడదాం అనే తెలంగాణ సిద్ధాంత కర్తల మాటలకు విలువిచ్చి తన తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి టిఆర్ఎస్ లో విలీనం చేసారు.అప్పటి నుండి విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో విజయశాంతి ఎంతో చురుకుగా పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో 2009 సాధారణ ఎన్నికలలో మెదక్ పార్లమెంట్ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి తొలిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టారు.ఆ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమె 2011 లో తన ఎంపీ పదవికి ఆమె రాజీనామా చేసారు.ఆ తరువాత మూడేళ్లు ఆమె తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.అయితే అనూహ్యంగా కెసిఆర్ తో విభేదాలతో ఆమె టిఆర్ఎస్ కు దూరం కావాల్సి వచ్చింది.తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన విజయశాంతికి తెలంగాణ పునర్నిర్మాణంలో అవకాశం లేకుండా పోయింది.దీనితో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు మద్దతుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2014 ఎన్నికలలో మెదక్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా వున్నారు.2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ గా నియమించారు.కానీ ఆ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.ఆ తరువాత మళ్ళి బీజేపీ లో చేరిన విజయశాంతి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ కాంపైనర్ గా పని చేసారు.ఈ సారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది.. ప్రస్తుతం విజయశాంతి సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ రాజకీయాలలో కూడా చురుకుగా వ్యవహారిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: