
బెంగళూరులో జగన్ బిగ్ స్కెచ్..ఇక కూటమికి చుక్కలే ?
టార్గెట్ చేసి మరి అరెస్టులు చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం బెంగళూరులోనే ఉంటున్న జగన్మోహన్ రెడ్డి... తాజాగా కొంతమంది వైసీపీ పెద్దలను తన వద్దకు పిలిపించుకున్నారట. ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారట జగన్మోహన్ రెడ్డి. త్వరలోనే పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సదరు నేతలతో... వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుత కఠినమైన పరిస్థితులలో... పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో చేస్తే మళ్లీ పార్టీకి ఊపు వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారట. నిత్యం జనాల్లో ఉన్నట్టుగా కూడా ఉంటుందని... భావిస్తున్నారట. అంతేకాదు.. ఈ పార్టీ సభ్యత్వం పూర్తికాగానే పాదయాత్ర కూడా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారట.
అప్పుడు ఏపీలో ఎక్కడ పర్యటించిన జగన్ మోహన్ రెడ్డికి ఆదరణ మరింత పెరిగే ఛాన్స్ ఉందని.. లెక్కలు వేసుకుంటున్నారట. ఇలా తాజాగా బెంగళూరులో సమావేశమైన వైసీపీ నేతలు అందరూ... వైసిపి సభ్యత్వానికి... నాంది పలికారట. మరి 11 స్థానాలు దక్కించుకున్న వైసీపీ పార్టీ ఈ విషయంలో ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా... ఇటీవలే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఏపీ సర్కార్.. పోసాని నాలుగు రోజుల కిందట అరెస్ట్ చేసింది. అంతేకాదు... మరో వారం రోజుల్లోనే.. వైసీపీ పార్టీలోని బడా లీడర్ ను అరెస్ట్ చేస్తారని అంటున్నారు. మరి ఎవరూ అరెస్ట్ అవుతారో చూడాలి.