ఆ కేసు ఏమైంది పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించిన తమ్మారెడ్డి.. వీడియో వైరల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ హాట్ టాపిక్ గా సుగాలి ప్రీతి కేసు మరొకసారి వినిపిస్తోంది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన నానా హంగామా చేసిన అధికారం చేపట్టి ఇప్పటికి 8 నెలలు అవుతూ ఉన్న ఈ విషయం పైన ఏవిధంగా స్పందించలేదు. దీంతో తాజాగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తో పాటుగా చాలామంది సుగాలి ప్రీతి కేసు ఏమైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు.


ఈమెరకు అందుకు సంబంధించి అభిప్రాయాలను సైతం తెలియజేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.. 2014-19 సమయంలో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు సైతం 2024 ఎన్నికల సమయంలో  తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కేసు పైన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ఆ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు.. అలాగే సుగాలి ప్రీతి కేసు లాంటి వాటిని ఇకమీదట జరగనివ్వబోమంటూ కూడా గతంలో వెల్లడించిన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఏపీలో మహిళలపై జరుగుతున్న దారుణాల పైన కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు అనే విధంగా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు.


గత ప్రభుత్వం లో కూడా ఈ కేసు పైన పురోగతి సాధించలేదని దోషులను పట్టుకోలేదని సిబిఐ ఏమో తమకు స్టాప్ లేదంటూ వివరించారని..అలాగే ఏపీలో 30 వేల మహిళలు బాలికలు మిస్సింగ్ అయ్యారంటూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటూ కూడా నిర్మాత తమ్మారెడ్డి ప్రశ్నించారు.. కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రతా పెంచాలని.. గత ప్రభుత్వంలో చేపట్టిన మెడికల్ కళాశాలలు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని ఏపీలో వైద్య సీట్లు కూడా పెరగాలని తెలిపారు. మహిళలు, విద్య వంటి అంశాల పైన కూడా ఎక్కువగా చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవాలంటే డిప్యూటీ సీఎం ప్రశ్నించారు తమ్మారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: