
Union budget 2025:సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. భారీ స్థాయిలో పన్ను మినహాయింపులు!
ఫిక్స్డ్ డిపాజిట్ల, ఇతర చిన్న మొత్తాల పొదుపులో సైతం పథకాలలో పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై వడ్డీ మినహాయింపు కూడా రెండింతలు చేసింది. ఇక నుంచి పాత పన్ను విధానంలో లక్ష రూపాయల వరకు మినహాయింపు ఉంటుందట. ఈ విధానంలో అద్దె ద్వారా కూడా వచ్చే ఆదాయం పైన ఊరట కలిగించేలా నిర్ణయాలు తీసుకుందట కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అద్దె ఆదాయం రూ. 2.40 లక్షల వరకు టీడీఎస్ మినహాయింపు ఉండేలా కల్పించింది. దీనిని ఇప్పుడు ఏకంగా రూ.6 లక్షలకు సైతం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఇకపోతే సీనియర్ సిటిజన్ ల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సీనియర్ సిటిజెన్లకు మంచి ఊరట కలిగించిందని చెప్పవచ్చు.
ఈసారి ఈ బడ్జెట్ లో 60 సంవత్సరాలు పైబడిన వారికి ఉరట కలిగించేలా ఉన్నట్లు కనిపిస్తోంది. లక్ష రూపాయల వరకు వడ్డీ ఆదాయం పైన మినహాయింపు కలిగించడంతోపాటు అలాగే ఆదాయం పైన 6 లక్షల వరకు మినహాయింపు కలిగించారట. దీంతో లక్షల మందికి ఊరట కలిగిందని చెప్పవచ్చు. ఇక నిర్మల సీతారామన్ 2025 ఏడాదికి గాను ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ఒక్క సీనియర్ సిటిజెన్లకే కాదు దాదాపు చాలామందికి పోరాట కలిగేలా ఉంది అని చెప్పవచ్చు.