![గుమ్మనూరు: నా వార్తలు రాస్తే..రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా ?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/politics/politics_analysis/gummanur-jayaram3109fabe-535c-418f-a2fc-41a7098bebe9-415x250.jpg)
గుమ్మనూరు: నా వార్తలు రాస్తే..రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా ?
అయితే తాజాగా గుంతకల్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు... వ్యాఖ్యలు చేయడం జరిగింది. జర్నలిస్టులను ఉద్దేశించి.. రెచ్చిపోయి మాట్లాడారు టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రైళ్లు పట్టాల పైన.. పడుకోబెట్టి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తనపై తప్పుడు వార్తలు రాసి.. అనవసరంగా బలి కాకూడదు అని... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అనవసరంగా తప్పుడు వార్తలు రాసి... తన ఇమేజ్ డ్యామేజ్ చేయకూడదని కోరారు. ఒకవేళ అలాంటి వార్తలు రాసిన వారు రుజువు చేయాలని జర్నలిస్టులకు సూచించారు గుమ్మనూర్ జయరాం. లేకపోతే అలాంటి జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానని... నేరుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాను ఎప్పుడూ కూడా ప్రజలకు అన్యాయం చేయబోనని... అన్యాయం చేసినప్పుడు తనకు రుజువులు చూపించాలని కోరాడు.
అలా కాదని ఇష్టం వచ్చినట్టు వార్తలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదని... రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానని కూడా హెచ్చరించారు. అయితే గుమ్మడి జయరాం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఇదెక్కడి సంతరా నాయనా ... ఏకంగా జర్నలిస్టులనే చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని కూటమి పార్టీలపై మండిపడుతున్నారు నెటిజెన్స్, ఏపీ ప్రజలు. ప్రశ్నిస్తే జర్నలిస్టులను కూడా చంపేస్తారా...? అని చంద్రబాబును నిలదీస్తున్నారు. ఇక అటు... టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఇదే నేర్పిస్తున్నాడా అని ఫైర్ అవుతున్నారు.