జగన్‌ పై కమ్మవాళ్లను రెచ్చగొడుతునన ఏబీవీ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని...రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర రావు మరోసారి టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి వెంకటేశ్వరరావును... ఒక ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు.... కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో... ఏబీ వెంకటేశ్వరరావు... రెచ్చిపోతున్నాడు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఏపీలో గెలవకుండా... చూడాలని పిలుపునిస్తున్నాడు. తాజాగా... కాపు నేతల సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర రావు.


వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చూడాలని... దాన్ని అడ్డుకునేది కాపు నేతలే అంటూ బాంబు పేల్చారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర రావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం కాకుండా.. కాపు నేతలు నిత్యం పని చేయాలని కోరారు. దీంతో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అయితే.. దీనిపై వైసీపీ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు.


వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం హాట్‌ కామెంట్స్‌ చేయడం జరిగింది.  ఏబీ వెంకటేశ్వరరావు మాజీ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ తరఫున ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. అహంకారంతో తలతిక్కగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహించారు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం.  కుల అహంకారం తో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయి అని తెలుసుకోవాలని చురకలు అంటించారు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం.

వైయస్సార్, వైఎస్ జగన్ లు ఏనాడు కులం కోసం పని చెయ్యలేదని... గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టే 40 శాతం ఓట్లు సాధించారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం. ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడని... ఏబీ  వెంకటేశ్వరరావు భాష గొడ్లు కాసేవారి భాషలా ఉందని ఆగ్రహించారు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: