
ఏపీ: లోకేష్- పవన్ కళ్యాణ్.. ఆంధ్ర అంత హాట్ టాపిక్ ఇదే.. ఎందుకలా..?
అయితే ఇలా టిడిపి నేతలు అందరూ కూడా మాట్లాడడానికి ముఖ్య కారణం గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతట జనసేన పార్టీ కూటమిలో కీలకంగా ఉందని పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోందని దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో టిడిపి పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదనే దృష్టిని ఆలోచించిన టిడిపి నేతలు లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం గా ప్రకటించాలని ఆ తర్వాత సీఎంగా పోటీ చేయడానికి అనుభవం కూడా వస్తుందనే విధంగా నేతలు మాట్లాడుతున్నారు.
కానీ చంద్రబాబు మాత్రం అలాంటివేమి చేయడం లేదు దీంతో లోకేష్ పేరు పార్టీ క్యాడర్లో వినిపించాలి అంటే కచ్చితంగా డిప్యూటీ సీఎం చేయాలి అని ఇప్పటికే చాలామంది టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిఠాపురానికి చెందిన టిడిపి నేత వర్మ కూడా లోకేష్ కష్టాన్ని గుర్తించి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటూ కోరడం జరిగింది ఈ విషయం అటు అక్కడ జనసేన నేతలను కార్యకర్తలను కూడా కాస్త అసహనానికి గురిచేస్తుందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలని జనసేన నేతలు చాలా పట్టుదలతో రాబోయే ఎన్నికలలో ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల కాలంలో పిఠాపురంలో కూడా వర్మ హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు.. అందుకే ఇప్పుడు తాజాగా లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ఆలోచనతో మరొకసారి ముందుకు వచ్చారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.