జగన్ ని.. ఘోరంగా ర్యాగింగ్ చేస్తున్న రఘురామ..? ఇది అయితే మామూలుగా లేదు గా?
ఎమ్మెల్యే ఉండి RRR, ap 11 ap 1111 ఈ నెంబర్ ప్లేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గోదావరి వెటకారానికి కేరాఫ్ గా చెప్పే డిప్యూటీ స్పీకర్ వాహనమో.. ఆయన అనుచరులకు చెందిన వాహనమో కానీ, ఈ వెరైటీ నెంబర్ ప్లేట్ తో ఏపీ రోడ్లపై చెక్కర్లు కొడుతున్న కారు అందరి దృష్టిని తెగ ఆకట్టుకుంటోంది.
గత ఐదేళ్లు రచ్చబండ పేరుతో అప్పటి అధికార పక్షానికి కంట్లో నలుసులా మారిన రఘురామకు ఎన్నికల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చివరి వరకు ఆయన టికెట్ పై స్పష్టత రాకపోవడంతో సోషల్ మీడియాలో రఘురామకు అనుకూలంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. ఎన్నికల అనంతరం కూడా రఘురామకు మంత్రి పదవి ఇవ్వాలని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పోస్టింగులు పెట్టేవారు. చివరికి సోషల్ ఒత్తిడితోనే త్రిపుల్ Rకు డిప్యూటీ స్పీకర్ చేశారంటున్నారు.
ఇలా డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామ తనకు మాత్రమే అలంకారమైన వెటకారంతో సభ్యులపై చలోక్తులు విసురుతూ సభను నడిపే తీరు ఆకట్టుకుంటోంది. ఇక ఆయన విమర్శనాస్ట్రాలు ఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్న వైసీపీ.. ప్రతిపక్ష హోదా లేదని సభను బహిష్కరించి తప్పించుకుంది.
వైసీపీ సభకు రాకపోయినా రఘురామ విమర్శల బాణాల నుంచి తప్పించుకోలేకపోతోంది. ఎన్నికల అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే నెంబర్ బోర్డు ఎంతలా వైరల్ అయిందో.. ఇప్పుడు రఘురామ అనుచరులు తయారు చేసిన కారు నెంబర్ ప్లేట్ కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతోంది. వైసీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలను సూచిస్తూ ap 11 ap 1111 అనే నెంబర్ ప్లేటుతో ఓ కారు ఏపీలో షికారు చేస్తోంది.
ap 11 ap 1111 నెంబరుతో ఉన్న కారు ఓరిజనల్ ఓనర్ ఎవరో? ఆ కారు అసలు నెంబర్ ఏదో తెలియకపోయినా, సోషల్ మీడియాలో ఈ ఫొటో ట్రోల్ చేస్తున్నవారు డిప్యూటీ స్పీకర్ రఘురామ మద్దతుదారులే అని అభిప్రాయపడుతున్నారు. దీంతో రఘురామ ర్యాగింగ్ వేరే లెవల్లో ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.