హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024: నోటి దూలతో చిక్కుల్లో పడ్డ కొండా సురేఖ..?

Pandrala Sravanthi
- వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొండా సురేఖ
- మంత్రి పదవి చేపట్టిన ఒంటరవుతున్నారా?

 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహిళా మంత్రులు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సీతక్క మరియు కొండా సురేఖ. ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన మహిళా మణులు. ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో ఇద్దరికీ మంత్రి పదవులు వరించాయి. కానీ ఇందులో మంత్రి పదవి వచ్చినా కానీ కొండా సురేఖకు మాత్రం మంత్రివర్గంలో తగిన గౌరవం, మర్యాదలు లభించడం లేదట. 2023- 24 సంవత్సరం ఈమెకు కాస్త కలిసి వచ్చినా, వివాదాలు ఎక్కువయ్యాయని అంటున్నారు. అలాంటి కొండా సురేఖ  ఏ ఏ వివాదాల్లో చిక్కుకుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 'కొండా'కు అండలేదా?


రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న కొండా సురేఖ అప్పుడప్పుడు కొన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈమె 1995లో మండల పరిషత్ నుంచి రాజకీయాన్ని మొదలుపెట్టి 1996లో పీసీసీ సభ్యురాలు అయింది. 1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, 2000 సంవత్సరంలో ఏఐసీసీ సభ్యురాలుగా నియమితురాలయింది. మళ్లీ 2004లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందింది. మళ్లీ 2009లో పరకాల ఎమ్మెల్యేగా గెలుపొంది మహిళా శిశువు సంక్షేమ వికలాంగులు జవైనల్ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది. మళ్లీ 2014లో సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందింది. 2018లో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరింది. 2023లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె తెలంగాణ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ప్రస్తుతం ఈమెకు పర్యావరణం, అటవీ ఎండోమెంట్ శాఖలు కేటాయించబడినయి.

ఎప్పుడైతే కొండా సురేఖ 2023-24 లో ప్రమాణ స్వీకారం చేసిందో అప్పటినుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈమె ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం వల్ల తన సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆమెను దూరంగా ఉంచుతున్నారట. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యకలాపాలు అయితే ఆ మంత్రిని పిలిస్తే ఏదో ఒక విధంగా మాట్లాడి వివాదాల క్రియేట్ చేస్తుందట. జాతీయస్థాయిలో చక్రం తిప్పే సురేఖ తన సొంత జిల్లాల్లో తన నోటి దురుసు వల్ల ఒంటరి అయిపోయారని టాక్ వినిపిస్తోంది. తాజాగా జనగామ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రశంసలతో ముంచేత్తుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాస్త తగ్గించినట్లు మాట్లాడారు. ఇదే కాకుండా కేటీఆర్ వల్లే సమంత నాగచైతన్య విడిపోయారని నాగార్జున కుటుంబాన్ని కూడా రోడ్డుకు తీసుకువచ్చారు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వివాదాలకు తెర లేపుతూ  తాను ఎన్నో చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు.  ఇలా 2023-24 సంవత్సరం ఆమెకు అద్భుతమైన పదవి అందించినా  కానీ వివాదాలు మాత్రం అనేక వస్తున్నాయని దీనివల్ల ఆమె మంత్రిగా కూడా అంతగా ఆదరణ పొందడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: