షాకింగ్: కూటమి సర్కార్ ఏపీ సచివాయాలను మూసేస్తుందా... !
ఏపీలో సచివాలయ వ్యవస్థ తెచ్చింది మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఆయన మానస పుత్రికలు గా సచివాలయాలకు వచ్చాయి కాన్సెప్ట్ కొత్తగా ఉండడం తో వాటిని జనాలు ఆదరించారు. అయితే అవి చాలా ఎక్కువ సంఖ్య లో ఉండడంతో పాటు పది మందిని ప్రతి సచివాలయంలో ఉద్యోగులుగా నియమించారు. దాని వల్ల పని భారం ఉద్యోగులకు తక్కువ అయింది. పైగా వలంటీర్ల ను తెచ్చి ఇంటింటికి ప్రభుత్వం సేవలను దగ్గర చేసింది. అయితే సచివాలయం వ్యవస్థ లో సిబ్బందికి తగిన పని లేకపోవడం ఒక కారణం అయితే వాలంటీర్లను మా పార్టీ వారు అని వైసిపి నేతలు సొంతం చేసుకోవడం తో ఈ రెండు వ్యవస్థలపై విమర్శలకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసివేశారు. ఇప్పుడు సచివాలయాలను ఏం చేయాలి ? వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి ? అనేదానిపై ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది .. మిగిలిన వేరే విభాగాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
అలాగే ప్రతి 2000 మందికి ఒక సచివాలయం .. అందు లో పది మంది ఉద్యోగులు కాకుండా ఇంకా పరిధి విస్తరించాలి చూస్తున్నారు. అలా చేస్తే సచివాలయాల సంఖ్య తగ్గుతుందన్న ఆలోచన ల్లో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సచివాలయాలు భారమే అన్న అభిప్రాయానికి కూటమి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే సచివాలయ ఉద్యోగులకు మళ్ళీ సెక్షన్ ఇచ్చి వేరే చోటకు బదిలీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి వేతనాలు చెల్లిస్తారు అన్న ఆశతో వారు ఉన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం లీక్ కావడం తో సచివాలయ ఉద్యోగుల్లో టెన్షన్ అయితే స్టార్ట్ అయ్యింది.