హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2024 : సంక్రాంతికి దించిన "గుంటూరు కారం" తో ఘాటెక్కించలేకపోయిన త్రివిక్రమ్..!!

FARMANULLA SHAIK
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అదిరిపోయే పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకొని స్టార్ డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.. టాలీవుడ్ స్టార్ హీరోలయిన మహేష్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, పవన్ కల్యాణ్ లతో త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించాడు..మొదట్లో రైటర్ గా అలరించిన త్రివిక్రమ్..యంగ్ హీరో తరుణ్ తో తెరకెక్కించిన “ నువ్వే నువ్వే “ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ తో “ అతడు “ సినిమా మొదలు పెట్టారు.. అతడు సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది.. ఎప్పటికి బోర్ కొట్టని సినిమాలలో అతడు మూవీ కూడా ఒకటి.. ఆ తరువాత చాలా ఏళ్లకు మహేష్ తో త్రివిక్రమ్ “ఖలేజా” అనే మూవీ చేసాడు.. ఈ సినిమా కూడా త్రివిక్రమ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.. కానీ  రాంగ్ టైం లో రిలీజ్ కావడంతో ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.. కానీ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ళకు  ఎందుకు ప్లాప్ చేశామా అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు..త్రివిక్రమ్ ఖలేజా సినిమాను అంత అద్భుతంగా తెరకెక్కించారు.. 

 ప్రెజెంట్ ఫుల్ ట్రెండ్ అవుతున్న మీమ్స్ లో ఖలేజా మూవీ మీమ్స్ చాలా ఉంటాయి.. అయితే ఖలేజా ప్లాప్ తరువాత త్రివిక్రమ్ వరుస సక్సెస్ లు సాధిస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.. అయితే మహేష్ తో మరో మూవీ చేయాలనీ మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో త్రివిక్రమ్ నీ కోరుతున్నారు..దీనితో త్రివిక్రమ్ మహేష్ తో “ గుంటూరు కారం “ అనే సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమాలో మహేష్ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ బిగ్గెస్ట్ మాస్ మూవీగా తెరకెక్కించారు..ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయిన ఈ సినిమా ఓ మోస్టరు విజయం అందుకుంది..
 త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నా కథ పాతది కావడం కథనంలో కూడా కొత్తదనం లేకపోవడంతో ‘గుంటూరు కారం’ సినిమా భారీ సక్సెస్ సాధించలేదు.. త్రివిక్రమ్ కెరీర్ లో ఒక సినిమా నిరుత్సాహపరిస్తే అద్భుతమైన సినిమాతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వడం ఆయన అలవాటు..త్రివిక్రమ్ తన తరువాత సినిమాను రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో చేస్తున్నాడు.. త్రివిక్రమ్ తన కెరీర్ లో మొదటిసారి ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: