అనన్యకు టాలీవుడ్ స్టార్స్ ఛాన్స్ ఇస్తారా.. బ్లాక్ బస్టర్ సాధిస్తే మాత్రం తిరుగుండదట!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య నగళ్లకు మంచి గుర్తింపు ఉంది. అనన్య తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనన్య నగళ్ల మరికొన్ని రోజుల్లో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో అనన్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనన్య రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.
 
అందం, అభినయం అనన్యకు పుష్కలంగా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఆమెకు ఛాన్స్ ఇస్తే కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు. అనన్య కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. టాలీవుడ్ దర్శకనిర్మాతలు అనన్య నగళ్లకు ఛాన్స్ ఇస్తే ఆమె కెరీర్ పరంగా ఎన్నో మెట్లు ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
అనన్య నగళ్ల చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా కెరీర్ పరంగా ఆమెకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. అనన్యకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. భిన్నమైన కథాంశాలకు ఓటు వేయడం ఆమెకు ఒక విధంగా ప్లస్ అవుతోంది. అనన్య నగళ్లకు 2025 సంవత్సరం కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.
 
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో హీరో వెన్నెల కిషోర్ అనేలా ప్రమోషన్స్ జరుగుతున్నా వెన్నెల కిషోర్ మాత్రం తాను ఈ సినిమాలో హీరో కాదని చెబుతున్నారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని 7 రోజుల డేట్స్ కావాలని అడిగి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో నన్ను యాక్ట్ చేయించారని స్క్రీన్ ప్లేలో మార్పులు చేసి నాతో డబ్బింగ్ చెప్పించారని ఆయన చెప్పుకొచ్చారు. అనన్య నగళ్ల తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది. అనన్య లుక్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: