విజయసాయి రెడ్డి తిరుగుబాటు...వాళ్లు బొక్కలోకి పోవాల్సిందే ?

Veldandi Saikiran
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తిరుగుబాటు చేశారు. అయితే.. తిరుగుబాటు అంటే.. వైసీపీ పార్టీపైన కాదు.. తనపై కూటమి చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తిరుగుబాటు చేయడం జరిగింది. భీమిలి తీరంలో ఉన్న స్థలం వివాదంపై తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పందించారు. భీమిలి తీరంలో మా వియ్యంకులు... టీడీపీ ఎంపీ తండ్రి భరత్ వద్దే భూమి కొన్నారని క్లారిటీ ఇచ్చారు. ఇంకొంత వేరే వాళ్ళ దగ్గర కొన్నారని స్పష్టతనిచ్చారు సాయిరెడ్డి.

అందులో ప్రభుత్వ భూమి ఇంచు కూడా లేదని క్లారిటీ ఇచ్చారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. శారద పీఠం కు మేము భూమి ఇస్తే రద్దు చేశారని పేర్కొన్నారు. చంద్ర బాబు తన హయాంలో అనేక పీఠాలకు, సంస్థలకు భూములు కేటాయించ లేదా? అంటూ ప్రశ్నించారు. అనవసరంగా ఆరోపణలు చేయకూడదని కోరారు. ఇక 2027 లో జమిలి ఎన్నికల్లో పొత్తులపై జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది నాయకుల్ని పొగుట్టుకున్నామన్నారు. ఇక  నాయకుల్ని వదలుకోబోమని... అందరినీ నిలబెట్టుకుంటామని ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి ప్రజల్ని, నాయకుల్ని కలుసుకునేందుకు ప్రజల్లోకి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వస్తున్నారని ప్రకటించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

వైసీపీ పార్టీలో పూర్తిస్థాయిలో మార్పులు చూస్తారన్నారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో కుమార స్వామిని వైసిపి ఎంపీలు ఇప్పటికే కలిశామని గుర్తు చేశారు
వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఎలాంటి పరిస్థితుల్లో ప్రయివేటీకరణ చేయం అని హామీ ఇచ్చారన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయిం తీసుకున్నా ఉద్యమిస్తామని కేంద్రానికి, కూటమికి హెచ్చరికలు జారీ చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఇకపై కూటమి ఆటలు సాగవని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: