సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి ..? అందులో పుష్ప పార్ట్ 2 సినిమా ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.
రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సీడెడ్ ఏరియాలో టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 51.04 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సీడెడ్ ఏరియాలో 34.75 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 సినిమా టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సీడెడ్ ఏరియాలో 31.85 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా ఇప్పటికే సీడెడ్ ఏరియాలో 27.20 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికి కూడా ఈ సినిమాకు మంచి హోల్డ్ సీడెడ్ ఏరియాలో దక్కుతుంది. దానితో ఈ మూవీ మరింత ముందు వరసలోకి సీడెడ్ ఏరియాలో దూసుకుపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సీడెడ్ ఏరియాలో 22.75 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో కొనసాగుతుంది.