డాకు మహారాజ్ : పెరిగిన బాలయ్య క్రేజ్.. ఓవర్సీస్ రేట్ తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం ప్రారంభంలో వీర సింహా రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా బాలయ్య "భగవంత్ కేసరి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య "డాకు మహారాజ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల అయిన భగవంత్ కేసరి సినిమాకు ఓవర్సీస్ లో ఆరు కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి మంచి టాక్ రావడం వల్ల ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమా ఓవర్సీస్ లో 7.35 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్ లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా ఓవర్సీస్ హక్కులకు భారీగా డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది.
దానితో ఈ సినిమా ఓవర్ సిస్ హక్కులను 8 కోట్ల స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దానితో ఈ మూవీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవాలి అంటే 2.3 నుండి 2.4 కోట్ల మిలియన్ డాలర్ల రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేయాల్సిన అవసరం వస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: