శ్రీతేజ్ కు మాటిస్తున్న...త్వరలో కలుస్తానంటున్న బన్నీ.!

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకి ప్రమయూఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, డైలాగులు ఇలా అన్ని ఆడియన్స్ ని కట్టి పడేశాయి. దీంతో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన మొదటివారంలో 1000 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.ఇదిలావుండగా ఈ చిత్రం విడుదల తేదీ డిసెంబర్ 5 అయినప్పటికీ డిసెంబర్ 4న ఎన్నో థియేటర్స్ లో ప్రీమియర్స్ వేశారు.ఇక ఈ ప్రీమియర్స్ కు ఎంతోమంది జనం పరుగులు తీశారు. ముఖ్యంగా హైదరాబాదులో సంధ్య థియేటర్ కి.. అల్లు అర్జున్, అతని ఫ్యామిలీ రావడంతో అక్కడ జరిగిన ప్రీమియర్ షో కి ప్రజలను కంట్రోల్ చేయడం పోలీసుల తరం కూడా కాలేదు.ఇక ఈ సంఘటనలోనే తొక్కిసలాటకు గురై రేవతి అనే మహిళ మృతి చెందగాప్రస్తుతం ఆమె కుమారుడు హాస్పిటల్ లో క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. ఈ కేసులో భాగంగానే ఈ మధ్యనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 

అయితే కొన్ని గంటల్లోనే ఆయన ఇన్ టర్మ్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఈ సంఘటనలో భాగంగా.. కొంతమంది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నిందిస్తున్నారు. అల్లు అర్జున్ అక్కడికి పోవడం వల్లే ఇలా జరిగింది అని.. అంతేకాకుండా బాధితుల కుటుంబానికి అల్లు అర్జున్ కేవలం 25 లక్షల డబ్బు ప్రకటించడం.. అసలు ఏమీ బాగాలేదు అనేది ఎంతోమంది వాదన.
ఇక ప్రస్తుతం ఆ అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది అని తెలియడంతో అల్లు అర్జున్ ఇప్పటికీ కూడా హాస్పిటల్కు పోలేదు అని.. ఆయన ప్రవర్తన మార్చుకోవాలి అంటూ ఎంతోమంది తీవ్రంగా సోషల్ మీడియాలో మంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అసలు ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళలేకపోయాడు అనే వివరణ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇచ్చారు.
"శ్రీ తేజ పరిస్థితి గురించి నేను చాలా చింతిస్తున్నాను. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న లీగల్ ప్రొసీడింగ్స్ వల్ల.. నన్ను అక్కడికి వెళ్ళద్దు అని వారు అద్వైజ్ చేయడం వల్ల నేను వెళ్లి హాస్పిటల్లో శ్రీతేజాన్ని చూడలేకున్నాను. కానీ నా ప్రార్ధనలు ఎల్లప్పుడూ ఆ అబ్బాయితో ఉంటాయి. అతనికి సంబంధించిన హాస్పిటల్ అవసరాలు, ఫ్యామిలీ అవసరాలు నేను చూసుకుంటాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తప్పకుండా వాళ్ళని వెళ్లి నేను కలుస్తాను," అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: