అప్పుడు జగన్ విషయంలో .. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో.. సేమ్ టు సేమ్ అదే సీన్..!

Thota Jaya Madhuri
ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో రెండు రోజులు మాత్రమే వేడిగా ట్రెండ్ అవుతుంది.  ఆ తర్వాత చల్లారిపోతుంది. వెరే సూపర్ న్యూస్ మళ్లీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఆది చాలా చాలా కామన్. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది.  బహుశా అల్లు అర్జున్ పరువు తీయడానికో.. లేకపోతే పాన్ ఇండియా స్టార్ కదా ఆ రేంజ్ లోనే ట్రోలింగ్కి గురి చేయడానికి సిద్ధమైయారో.. రీజన్ ఏంటో తెలియదు కానీ బన్నీ అరెస్టు అయిపోయి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేసి మళ్లీ తన మావయ్య చిరంజీవి ఇంటికి అదే విధంగా నాగబాబు ఇంటికి వెళ్లినా కూడా ఇంకా విషయం సోషల్ మీడియాలో బన్నీ పేరు వైరల్ అవుతూనే ఉంది .


సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు తెలంగాణా పోలీసులు. అంతేకాదు జైలుకు వెళ్లి ఒక రోజు నిద్ర కూడా చేసి వచ్చారు. ఆ కారణంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు . అయితే ఇదే మూమెంట్లో వేణు స్వామి పేరు హైలెట్గా మారింది. వేణు స్వామి ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఢమాల్ అంటూ పడిపోతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు .  గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టబోతుంది అంటూ బల్ల గుద్ది మరీ చెప్పాడు వేణు స్వామి .


అయితే సీన్ ఎలా రివర్స్ అయిందో అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఏపీ కూటమి చేతిలో ఓడిపోయాడు. అల్లు అర్జున్ విషయంలో కూడా వేణు స్వామి చాలా గొప్పగా పొగిడారు. అల్లు అర్జున్ ని ఎవరు టచ్ చేయలేరు అని ..ఆ స్థాయికి ఎదిగిపోతాడు అని చెప్పుకొచ్చారు.  అయితే పుష్ప రాజ్ సినిమాతో ఆ స్థాయికి వెళ్లిన ఇలా జైలుకు వెళ్లి మాత్రం తన పరువు మొత్తం తీసేసుకున్నాడు . దీన్నే సోషల్ మీడియాలో జనాలు వెలేత్తి చూపిస్తున్నారు.  నువ్వు ఎవరి పేరు చెప్తే వాళ్ళు సర్వనాశనం అయిపోతున్నారు అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: