గేమ్ ఛేంజర్ కోసం బన్నీని ఫాలో కానున్న చరణ్.. బ్లాక్బస్టర్ కొట్టేనా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా పెద్ద ఎత్తున మొదలు పెట్టింది. ఇకపోతే ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ , అల్లు అర్జున్ ను ఫాలో కాబోతున్నట్టు తెలుస్తుంది. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు గెస్ట్ గా వచ్చాడు.

ఇకపోతే బాలయ్య ఈ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ అద్భుతమైన బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఫార్ములానే రామ్ చరణ్ "గేమ్ చేంజర్" సినిమా విషయంలో ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా అన్ స్టాపబుల్ టాక్ షో కు గెస్ట్ రాబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: