టాలీవుడ్ మొత్తం బన్నీ ఇంటికి వెళ్లిన ఆ స్టార్ హీరో కనీసం సోషల్ మీడియా వేదిక కూడా స్పందించలేదు..ఎందుకంటే..?
పోనీ ఆయన ఏమన్నా పనిలో ఉన్నాడా? ఆ కారణంగానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదా ..? అంటే అది కూడా కాదు అనే తెలుస్తుంది. ఆయన హైదరాబాదులోనే ఉన్నాడు . అయితే ఎందుకు అల్లు అర్జున్ ని చూడడానికి అల్లు నివాసానికి వెళ్లలేదు అనేది పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే వాళ్ల మధ్య పెద్దగా గొడవలు ఏమీ లేవు అని.. ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు అని.. ఆ కారణంగానే అల్లు అర్జున్ ని ఇంటికి వెళ్లి పరామర్శించలేకపోయాడు అంటున్నారు ఆ హీరో అభిమానులు .
ఆయన రాలేకపోయిన ఫోన్ లో అయినా పరామర్శించొచ్చుగా అనేది బన్నీ అభిమానుల వర్షెన్. ప్రభాస్ దూరంగా ఉండి రాలేదు . అయినా ఫోన్ లో పరామర్శించారుగా . తారక్ కూడా ఇంటికి రాలేదు ..పరామర్శించారుగా ..అలాగే ఫోన్ ద్వారా నాలుగు ముక్కలు మాట్లాడొచ్చుగా అంటూ ఆ హీరోనే దెప్పిపొడుస్తున్నారు . మెగా కుటుంబంతో ఇష్యూ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా మూమెంట్లో ఈ హీరో ఇలా బిహేవ్ చేయడంతో అల్లు అర్జున్ కి ఈ హీరోకి మధ్య ఏమైనా పాత తగాదాలు ఉన్నాయా..? అన్న విధంగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.