లక్ష్మీపార్వతికి కీలక పదవి...విజయమ్మ కంటే జగన్ కు ఆమె ఎక్కువైందా ?
అటు ఆర్ కృష్ణయ్య లాంటి వారైతే బిజెపి వైపు వెళ్లి రాజ్యసభ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నందమూరి లక్ష్మీపార్వతి కి కీలక పదవి కట్టబెట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతికి అవకాశం కల్పించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు కేంద్ర వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి... ఓ ప్రకటన కూడా విడుదల కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక నేతలు బయటకు వెళ్తున్న నేపథ్యంలో... నందమూరి కుటుంబానికి చెందిన లక్ష్మీపార్వతి కి పదవి ఇవ్వడం... చర్చనీయాంశమైంది.
అయితే దీనిపై కొంతమంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కన్నతల్లి విజయమ్మ కంటే.. నందమూరి లక్ష్మీపార్వతి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువైందని కొంతమంది... ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి సోషల్ మీడియాలో ఈ అంశంపై ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని కూడా మండిపడుతున్నారు. ఇక అటు వైఎస్ విజయమ్మను దూరం చూసుకుని.. వేరే వాళ్లను దగ్గర చేసుకుంటున్నాడని జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.