పుష్ప సినిమా థియేటర్లోకి వచ్చి ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో, ఆ విధంగానే ఆయన కేసు వ్యవహారం కూడా అంతే హైలెట్ అయింది. ఈ కేసు ద్వారా అల్లు అర్జున్ తన జీవితంలో మొదటిసారి జైలు జీవితాన్ని గడిపారు. రాత్రంతా చంచల్ గూడా జైల్లో ఉన్నారు. ఇలా నేషనల్ అవార్డు తీసుకున్న అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాంటి ఈ తరుణంలో గత రెండు రోజుల నుంచి అల్లు అర్జున్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి అనేక డిబేట్లు జరుగుతున్నాయి.. అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప సినిమా థియేటర్లలో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.. అలాంటి ఈ తరుణంలో అల్లు అర్జున్ కు ఇది మొదటి వివాదం కాదట.
ఇప్పటివరకు ఆయన కెరియర్ లో అనేక వివాదాలు వచ్చాయని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆయనను చుట్టుముట్టిన వివాదాలు ఏంటి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 2014లో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా ఇరుక్కున్నారట. మద్యం బాగా తాగి పోలీసులపై గొడవకు దిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా 2016 సంవత్సరంలో వచ్చినటువంటి సరైనోడు చిత్రకథని వర్మ రాస్తే దానిని అల్లు అర్జున్ నిర్మాతలు కలిసి దొంగిలించారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.
ఇక ఇదే కాకుండా 2016లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవకు దిగారని అది కూడా అప్పట్లో రచ్చ అయిందని తెలుస్తోంది. ఈయన దువ్వాడ జగన్నాథం అనే సినిమాలో నటించినప్పుడు బ్రాహ్మణ గెటప్ లో నటించారు. అయితే ఇందులో అల్లు అర్జున్ చేసిన పాత్రలకు బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. నిరసనలు కూడా తెలిపాయి. ఇక తాజాగా పుష్ప2 రిలీజ్ సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోవడం. అల్లు అర్జున్ అరెస్టు చేయడం, రిలీజ్ అవ్వడం కూడా వివాదం అయింది.