వైసీపీ కంచుకోట‌లో జ‌గ‌న్ సీన్ రివ‌ర్స్‌... జెండా తిర‌గ‌బ‌డుతోంది...?

RAMAKRISHNA S.S.
- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ ) . .
వైసీపీకి కంచుకోట అయినా కడపలో ఆ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని టిడిపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే కడప కార్పొరేషన్ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కడప కార్పొరేటర్ల ను త‌మ‌ వైపు తిప్పుకోవడానికి సీరియస్గా అధికార పార్టీ కసరత్తులు చేస్తున్నట్టు ముందే చెప్పుకున్నాం. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకు నేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. కడపలో పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారని సమాచారంతో ఆయన హడావుడి చేస్తున్నారు. కడప కార్పొరేటర్లతో చర్చిస్తున్నారు .. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు .. వీలైనంతవరకు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు .. ఆర్థిక ఇబ్బందులను కార్పొరేటర్ల సమస్యలను ప్రత్యేకంగా చూస్తామని అవినాష్ రెడ్డి హామీ ఇస్తున్నారు.

ఏదోరకంగా కడపలో కార్పొరేటర్లు కలుపుకోవాలని వైసిపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. లోక‌ల్‌ ఎంపీ అవినాష్ గట్టి పుట్ట దల‌తో ఉన్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడే తమను అసలు పట్టించుకోలేదన్న బాధ కడప కార్పొరేటర్లలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేదు ... ఇక ఇప్పుడు ఏమి చేస్తారని ప్రశ్న ?కార్పొరేటర్ల నుంచి వస్తుంది. అయితే కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కడప కార్పొరేషన్ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసుకునేందుకు మామూలు ప్రయత్నాలు చేయటం లేదు. మ‌రి క‌డ‌ప లాంటి చోటే వైసీపీ ప‌రిస్థితి ఇలా ఉంది అంటే అది జ‌గ‌న్ కు ఖ‌చ్చితంగా పెద్ద షాకే అనుకోవాలి. దీని ని జ‌గ‌న్ ఎల సెట్ చేసుకుని అక్క‌డ పార్టీని కాపాడుకుంటాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: